Radhe Shyam Box Office Collection: ఈ సమ్మర్ టాలీవుడ్ కు ఊపు వచ్చింది. ‘రాధేశ్యామ్’ గ్రాండ్ హిట్ తో జోష్ వచ్చింది. పైగా ఇక నుంచి పెద్ద సినిమాలు విడుదలకు క్యూలో ఉన్నాయి. అన్నింటికంటే ముందు భీమ్లా నాయక్ వచ్చింది. ఇప్పుడు ‘రాధేశ్యామ్’. తర్వాత ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్ 2 , ఆచార్య రానున్నాయి. నెల రోజుల గ్యాప్ లోనే ఇవన్నీ థియేటర్లలో విడుదల కానున్నాయి. ఈ మూడు సినిమాల్లో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ పై బోలెడు అంచనాలున్నాయి. ఈ రెండు సినిమాల బడ్జెట్ కలిపితే ఏకంగా 800 కోట్ల రూపాయలు అవుతుంది.

కాగా ఇదివరకూ రిలీజ్ అయిన అఖండ, పుష్ప, ‘భీమ్లానాయక్’లను మించి ‘రాధేశ్యామ్’ సినిమా కలెక్షన్లు సాధించడంతో ఇక ఈ సినిమాకు తిరుగులేకుండా పోయింది. ‘రాధేశ్యామ్’ బాలీవుడ్ లో, టాలీవుడ్ లో పోటీలేకపోవడం సినిమాకు ప్లస్ అయ్యింది. ఇక రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’కు ప్యాన్ ఇండియా స్థాయిలో బజ్ ఉంది. చరణ్, ఎన్టీఆర్ హీరోలు కావడం.. బాహుబలి తర్వాత రాజమౌళి తీస్తుండడంతో భారీ అంచనాలున్నాయి.
Also Read: ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చిన ‘ఓ అల్లు అర్జును’
అయితే ఈ సినిమా ఆడియో పెద్దగా ప్రేక్షకుల అంచనాలు అందుకోకపోవడం మైనస్ గా మారింది. కథ చూస్తే చరిత్రను జక్కన్న వక్రీకరిస్తున్నారని ఆరోపణలున్నాయి. కానీ, ప్రభాస్, పూజాల రాధేశ్యామ్ కు హిందీలో భారీ అంచనాలు ముందు నుంచి క్రియేట్ అయ్యాయి. లవ్ స్టోరీ, పాటలు, ఫీల్ గుడ్ మూవీ అన్న కాన్సెప్ట్ తో ఈ సినిమాకు ప్లస్ గా మారింది.
కాకపోతే, యాక్షన్ సీన్ లు లేకపోవడం మైనస్ అంటున్నారు. ఇక భీమ్లా నాయక్ మూవీ విషయానికి వస్తే కొదమ సింహాల్లాంటి హీరోలు రానా, పవన్ లు నటిస్తుండడం..పైగా మలయాళ హిట్ మూవీ రిమేక్ కావడంతో సినిమా సక్సెస్ అయ్యి కలెక్షన్ల వర్షం కురిసింది. అదే ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. పాటలు అదిరిపోయేలా ఉండడంతో సినిమాకు హైప్ వచ్చింది.

మరి ఈ సినిమాలన్నిటి తొలి వారం కలెక్షన్స్ విషయానికి వస్తే.. భీమ్లానాయక్ తొలివారం 170 కోట్ల పైచిలుకు కలెక్షన్లు సాధించింది. ఇక పుష్ప మూవీ తొలివారంలో ప్యాన్ ఇండియా లెవల్ లో 151 కోట్లు సాధించింది. బాలకృష్ణ ‘అఖండ’ మూవీ తొలి వారం 77.75 కోట్లు రాబట్టింది. అయితే, రాధేశ్యామ్ మాత్రం 187 కోట్లు వసూలు రాబట్టింది. దీన్ని బట్టి తెలుగు నాట భీమ్లానాయక్, పుష్ప, అఖండలను కలెక్షన్స్ విషయంలో రాధేశ్యామ్ మించేసింది.
Also Read: బొమ్మరిల్లు మూవీని వదులుకున్న హీరో ఇతనే.. చేసుంటే పెద్ద స్టార్ అయ్యేవాడేమో..