అలాగే గతంలో హీరో ముంబయిలో మాఫియాని అంతం చేసిన నేపథ్యంలో మరోసారి ఆయన్ని తీసుకురావాలని అనడం లాంటి డైలాగ్ లు, దీంతో పాటు మళ్లీ పోలీస్ డ్రెస్ వేసుకుని విలన్లని రాధే ఎలా మట్టు బెట్టాడు అనే కోణంలోని షాట్స్ కూడా సినిమా పై క్రేజ్ ను పెంచాయి. ఇక సల్మాన్ ఖాన్.. మూడోసారి ప్రభుదేవా దర్శకత్వంలో ‘రాధే’ సినిమా చేస్తోన్నాడు. వీరి కలయికలో సినిమా వస్తుండటం.. పైగా సినిమాలో మెయిన్ కంటెంట్ హెవీ యాక్షన్ నేపథ్యంలో ఉండటం కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ కానుంది. కరోనా లేకపోయి ఉంటే.. ఈ సినిమా గతేడాదే రిలీజ్ అయి ఉండేది.
ఇక ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన దిశా పటానీ నటిస్తోంది. ఇక సల్మాన్ ఖాన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎన్ని సంచలనాలు సృష్టిస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే సల్మాన్ అభిమానులు రాధే కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈద్ కానుకగా ఇటు థియేటర్ అటు ఓటీటీలో ఒకేసారి విడుదల అవుతూ ఉండటం విశేషం.
కాగా ఈ సినిమాని జీ స్టూడియోస్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ సినిమాని అటు థియేటర్లోనూ, ఇటు జీ ప్లెక్స్ కి చెందిన స్ట్రీమింగ్ సైట్ లో ‘పే పర్ వ్యూ’ పద్దతిలో విడుదల కాబోతుంది.