https://oktelugu.com/

Radhe Shyam: రాధేశ్యామ్​ నుంచి మరో సాలిట్​ అప్​డేట్​.. ట్రైలర్​ ఎలా ఉండనుందంటే?

Radhe Shyam: బాహుబలితో పాన్​ఇండియా స్టార్​గా గుర్తింపు పొందిన ప్రభాస్​.. ఆ తర్వాత వరుసగా అన్నీ అదే రేంజ్​ సినిమాలు తీస్తూ కెరీర్​లో దూసుకెళ్లిపోతున్నారు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా రాధే శ్యామ్​లోనూ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తోంది. మొదటి నుంచి ఈ సినిమాపై బారీగా అంచనాలు పెంచుతూ వస్తోంది చిత్రబృందం. ఈ క్రమంలోనే ఫొటోలు, పాటలు, టీజర్లు విడుదల చేస్తూ మరింత హైప్​ను క్రియేట్ చేసింది. కృష్ణంరాజు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 21, 2021 / 03:50 PM IST
    Follow us on

    Radhe Shyam: బాహుబలితో పాన్​ఇండియా స్టార్​గా గుర్తింపు పొందిన ప్రభాస్​.. ఆ తర్వాత వరుసగా అన్నీ అదే రేంజ్​ సినిమాలు తీస్తూ కెరీర్​లో దూసుకెళ్లిపోతున్నారు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా రాధే శ్యామ్​లోనూ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తోంది. మొదటి నుంచి ఈ సినిమాపై బారీగా అంచనాలు పెంచుతూ వస్తోంది చిత్రబృందం. ఈ క్రమంలోనే ఫొటోలు, పాటలు, టీజర్లు విడుదల చేస్తూ మరింత హైప్​ను క్రియేట్ చేసింది. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతోంది.  ఈ క్రమంలోనే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్​లో జోరు పెంచింది.

    Radhe Shyam

    Also Read: 2022లో సందడి చేయనున్న అగ్రహీరోలు వీరే..

    కాగా, ఇప్పటికే విడుదలైన పాటలు సినిమా విడుదల కంటే ముందే రికార్డులను సృష్టిస్తున్నాయి. తాజాగా, ఈ సినిమా ట్రైలర్​ గురించి మేకర్స్ సాలిడ్ అప్​డేట్​తో ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ట్రైలర్​ గురించి ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే డిసెంబరు 23న జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్​లో ట్రైలర్​ను విడుదల చేసేందుకు సిద్దమైంది. అయితే, ఈ ట్రైలర్ నిడివి గురించి ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ట్రైలర్​ను సుమారు 3 నుమిషాల 3 సెకన్ల పాటు కట్​ చేశారట. మరి ఇందులో ఎలాంటి విజువల్స్​తో దర్శకుడు ప్రేక్షకులను మాయ చేయనున్నాడో చూడాల్సి ఉంది. ఈ క్రమంలోనే ట్రైలర్​ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    ఈ సినిమాతో పాటు ప్రభాస్ సలార్ అనే మరో సినిమా కూడా తీస్తున్నారు. కాగా, ఓంరౌత్ దర్శకత్వంలో వస్తోన్న ఆదిపురుష్​లోనూ హీరోగా నటిస్తున్నారు ప్రభాస్​.

    Also Read: ఆ పాత్ర కోసం 15 గెటప్ లు ట్రై చేశా: నాని