https://oktelugu.com/

Bheemla Nayak: భీమ్లానాయక్ వాయిదా పడటానికి కారణం అతనేనా?

Bheemla Nayak: ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి పెద్ద సినిమాలే బరిలోకి దిగనున్నాయి. ఆర్​ఆర్ఆర్​, రాధేశ్యామ్​, భీమ్లానాయక్​ వంటి పాన్​ ఇండియా చిత్రాలు ఢీ కొట్టేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలు విడుదల తేదీని కూడా ప్రకటించాయి. అయితే, మధ్యలో పలు సినిమాలు వాయిదా పడనున్నాయని వార్తలు వినిపించాయి. అనుకున్నట్లే స్టార్ హీరోల సినిమా విడుదల తేదీలు తారుమారయ్యాయి. ఈ రోజు జరిగిన నిర్మాతల సమావేశంలో సుదీర్ఘ చర్చ అనంతరం.. పవన్ కళ్యాణ్​ హీరోగా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 21, 2021 / 04:08 PM IST
    Follow us on

    Bheemla Nayak: ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి పెద్ద సినిమాలే బరిలోకి దిగనున్నాయి. ఆర్​ఆర్ఆర్​, రాధేశ్యామ్​, భీమ్లానాయక్​ వంటి పాన్​ ఇండియా చిత్రాలు ఢీ కొట్టేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలు విడుదల తేదీని కూడా ప్రకటించాయి. అయితే, మధ్యలో పలు సినిమాలు వాయిదా పడనున్నాయని వార్తలు వినిపించాయి. అనుకున్నట్లే స్టార్ హీరోల సినిమా విడుదల తేదీలు తారుమారయ్యాయి. ఈ రోజు జరిగిన నిర్మాతల సమావేశంలో సుదీర్ఘ చర్చ అనంతరం.. పవన్ కళ్యాణ్​ హీరోగా నటించిన భీమ్లా నాయక్​ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు వెనక్కి తగ్గకూడదు అనుకున్న నిర్మాత నాగ వంశీ.. తన హీరో మాటకు గౌరవం ఇచ్చి.. వెనక్కి తగ్గినట్లు అధికారికంగా ప్రకటించారు.

    Pawan Kalyan fans

    Also Read: ఆగ్రహం మీదున్న పవన్ ఫ్యాన్స్‌.. వారికి ఏం సమాధానం ఇస్తారు..?

    అయితే, ఈ సినిమాను వాయిదా వేయడం వెనక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ హస్తం ఉందని టాక్​. ఆయనే అందరినీ ఒప్పించి మరి విడుదల తేదీని వాయిదా వేయించినట్లు తెలుస్తోంది. ఈ సంక్రాంతి బరిలో రాజమౌళి తెరకెక్కించిన ఆర్​ఆర్​ఆర్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిర్మాత డివివి దానయ్య, రాజమౌళి స్వయంగా త్రివిక్రమ్​ని కలిసి భీమ్లానాయక్​ను రేసు నుంచి తప్పించాలని కోరినట్లు సమాచారం.

    దీంతో పవన్​తో చర్చించి మరి త్రివిక్రమ్ ఈ నిర్ణయం తీసుకున్నారట .ఇదే విషయాన్ని పవన్​తో కలిసి రాజమౌళి మాట్లాడాలనుకున్నప్పటికీ.. పవన్​ తన భార్యతో కలిసి క్రిస్మస్​ వేడుకలకు విదేశాలకు వెళ్తున్నందున వీలు కాలేదట. అందుకే త్రివిక్రమ్​ను కలిసినట్లు సమాచారం. ఎన్నో అంచనాల మధ్య వస్తోన్న ఆర్​ఆర్​ఆర్​ సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల కానుంది. ఇక మిగిలిన సినిమాలన్నీ యథావిధిగా ప్రకటించిన తేదీల్లోనే థియేటర్లలోకి రానున్నాయి.

    Also Read: సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్న భీమ్లా నాయక్… రిలీజ్ ఎప్పుడంటే