Pawan Kalyan fans: తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతుందంటే ఫ్యాన్స్‌కు పెద్ద పండగే.. ఇందులో కూడా మెగా అభిమానులు పవన్ అభిమానులు అంటూ రెండు రకాలుగా ఉంటారని కొందరు అంటుంటారు. మెగా అభిమానులు అంటే చిరు, చెర్రీలతో పాటు మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరోలను అభిమానించే వారని అర్థం.. కానీ పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఆయన కోసమే ప్రత్యేకంగా ఎదరు చూస్తుంటారు. మిగతా మెగా హీరోల సినిమాలను సోసోగా చూస్తుంటారట.. కానీ మెగా ఫ్యామిలీలో పవన్ కూడా ఉంటాడు.. అందుకే అందరికీ గౌరవం ఉంటుంది. పవన్ ఫ్యాన్స్ తమ దేవుడి చిత్రాలను ముందుగా ఇంపార్టెంట్ ఇచ్చాకే తర్వాతే ఎవరైనా అంటుంటారని టాక్.. ప్రస్తుతం ఇండస్ట్రీ మీద ప్రొడ్యూసర్స్ గిల్డ్ మీద పవన్ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారని తెలుస్తోంది.
సంక్రాంతి బరి నుంచి పవన్‌ను తప్పిస్తారా?
సంక్రాంతి బరిలో పవన్ అప్ కమింగ్ మూవీ భీమ్లానాయక్ విడుదల కావాల్సి ఉంది. అదే టైంలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ బరిలో నిలిచింది. మరోవైపు ప్రభాస్ హీరోగా వస్తున్న ‘రాధేశ్యామ్’ కూడా ఉండటంతో ప్రొడ్యూసర్స్ గిల్డ్ పవన్‌తో మాట్లాడి భీమ్లా నాయక్ విడుదలను ఫిబ్రవరి 25 కు వాయిదా వేయించారు. అయితే, సంక్రాంతి బరిలో నిలిచిన రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ మరియు పాన్ ఇండియా రేంజ్ కలిగినవి.. ఒకే సారి మూడు పెద్ద సినిమాలు విడుదలైతే కలెక్షన్ల పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రొడ్యూసర్స్ గిల్డ్ పవన్ కళ్యాణ్‌ను ఫేవర్ అడిగినట్టు తెలుస్తోంది. దీనికి పవర్ స్టార్ కూడా ఓకే చెప్పారట..
ఫ్యాన్స్‌కు ఏం అన్సర్ చెబుతారు?
ప్రొడ్యూసర్స్ గిల్డ్ తమ స్వార్థం కోసం.. భారీ బడ్జెట్ చిత్రాలకు కలెక్షన్లు తగ్గకూడదని ప్లాన్ చేసి పవన్ సినిమాను సంక్రాంతి బరినుంచి తప్పించారు. ఈ విషయం తెలియడంతో పవన్ అభిమానులు రగిలిపోతున్నారట.. తమ దేవుడి సినిమాను అలా ఎలా తప్పిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీకు ఏదైనా సాయం కావాలంటే పవన్ గుర్తొస్తారు. పవన్ కళ్యాణ్ పరిశ్రమ గురించి, టికెట్ల రెట్లు తగ్గించడం గురించి మాట్లాడినప్పుడు.. ప్రొడ్యుసర్ గిల్డ్ నుంచి ఒక్కరు కూడా పవన్‌కు తోడుగా నిలబడలేదు. అధికార పార్టీ నేతలు పవన్‌ను విమర్శిస్తుంటే ఒక్కడే భరించాడు. అప్పుడు ఏం చేశారంటూ ప్రొడ్యూసర్స్ గిల్డ్ పై పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆవేశంతో ఉన్నారట..
Also Read: Nithya Menen: కేరళ కుట్టి నిత్యా మీనన్ పెళ్లి.. నిజమేనా
పవన్ అభిమానులు తమ ఇబ్బందులను అర్ధం చేసుకోవాలని ప్రొడ్యూసర్ గిల్డ్ నుంచి నిర్మాతలు కోరినా పవన్ ఫ్యాన్స్ మాత్రం తగ్గేదెలే అంటున్నారట.. ‘ఇండస్ట్రీ కోసం పవన్ ప్రతీసారి నిలబడుతున్నారు. మీరు మాత్రం ఆయన్ను పట్టించుకోవడం లేదు. ఒక వర్గం పవన్‌ను టార్గెట్ చేసి విమర్శిస్తే ప్రొడ్యూసర్ గిల్డ్ ఎక్కడికి వెళ్ళిందని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి ఎవరు సమాధానం చెబుతారో తెలియాల్సి ఉంది.
Also Read: Rebel Star: ‘రెబల్ స్టార్’ను చూసి భయపడుతున్న డార్లింగ్ ఫ్యాన్స్..!