Jai Bhim: ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై.. ప్రేక్షకులను ఎమోషనల్‌గా ఆకట్టుకున్నసినిమా జైభీమ్. ఓ గిరిజన యువకుడ్ని చేయని నేరానికి పోలీసులు అరెస్టు చేసి విచారణ వేరుతో హింసిస్తారు. అయితే, ఈ విషయంపై ఓ యంగ్లాయర్ చేసిన న్యాయపోరాటమే ఈ సినిమా కథాంశం. 1990ల్లో సి. ఉమామహేశ్వరరావు తీసిన అంకురం సినిమాను జైభీమ్ గుర్తు చేస్తోందని కొందరు సినీ ప్రియులు అంటున్నారు. అలా జాతీయ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న సినిమా జైభీమ్. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు జై భీమ్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా, రాధేశ్యామ్ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ జైభీమ్ సినిమా చూసి ట్విట్టర్ వేదికగా ఏమోషనల్‌గా స్పందించారు.
కొన్ని సినిమాలు చాలా అరదుగా మనల్ని ఎమోషనల్‌గా హద్దుకుంటాయని అన్నారు. గతంలో నగ్నసత్యాలు కొన్ని సంఘటనలన్ని జై భీమ్ కళ్లకు కట్టినట్లు చూపించిందని తెలిపారు. ఈ సినిమా చూస్తున్నంతసేపు తననకు ఎంతో భావోద్వేగానికి గురి చేసిందని.. తనకు మాటలు కూడా రాకుండా చేసిందని అన్నారు. ఇంతటి అద్భుతమైన సినిమాను అందించిన హీరో సూర్య, దర్శకుడు జ్ఞానవేల్‌కి గౌరవాభినందనలు తెలిపుతూ ట్వీట్ చేశారు రాధాకృష్ణ. సూర్య, జ్యోతిక జంటగా నిర్మించిన సినిమా జై భీమ్. గతంలో ఆకాశమే నీ హద్దురా సినిమాతో సూపర్ హిట్ కొట్టారు సూర్య. అందులో దెక్కన్ ఎయిర్ సంస్థ స్థాపకుడు గోపినాథ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. మరోవైపు నవరస వెబ్‌సిరీస్‌లోనూ ఓ ఎపిసోడ్లో నటించారు. ఇలా వరుసగా విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు దూసుకెళ్లిపోతున్నారు.