Raayan Movie Twitter Talk: రాయన్ ట్విట్టర్ టాక్: ధనుష్ వీర విహారం, సినిమాలో హైలెట్స్ అవే! ఇంతకీ హిట్టా ఫట్టా?

ధనుష్ లేటెస్ట్ మూవీ రాయన్. ఆయన 50వ చిత్రంగా తెరకెక్కింది. ఈ చిత్రానికి ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం. జులై 26న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. రాయన్ మూవీ ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆడియన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు.

Written By: S Reddy, Updated On : July 26, 2024 10:34 am

Raayan Movie Twitter Talk

Follow us on

Raayan Movie Twitter Talk: రాయన్ మూవీ పై భారీ అంచనాలున్నాయి. రాయన్ మూవీ ట్రైలర్స్ ఆకట్టుకోగా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించడం మరొక విశేషం. తన 50వ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యత ధనుష్ తీసుకున్నారు. గతంలో కూడా ధనుష్ ఓ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రాయన్ కోసం డీగ్లామర్ లుక్ ట్రై చేశాడు. గుండు చేయించుకుని సరికొత్తగా మేకోవర్ అయ్యాడు.

రాయన్ మూవీలో భారీ క్యాస్ట్ నటించారు. ఎస్ జే సూర్య ప్రధాన విలన్ పాత్ర చేశారు. ప్రకాష్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్, దసరా విజయ్, అపర్ణ బాలమురళి కీలక రోల్స్ చేశారు. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఓ ప్రధాన పాత్ర చేయడం విశేషం. ధనుష్ అన్నయ్య సెల్వ రాఘవన్ సైతం రాయన్ చిత్రంలో ఓ పాత్ర చేశాడు. జులై 26న వరల్డ్ వైడ్ తెలుగు, తమిళ భాషల్లో రాయన్ విడుదల చేశారు. యూఎస్ లో ఇప్పటికే ప్రీమియర్స్ ముగిశాయి.

రాయన్ మూవీ చూసిన ఆడియన్స్ సినిమా ఎలా ఉందో సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. రాయన్ చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కడం విశేషం. ధనుష్ నటన సినిమాకు హైలెట్ అంటున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలగడం ఖాయం అంటున్నారు. ఫస్ట్ హ్లాఫ్ చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మెప్పిస్తుంది. సెకండ్ హాఫ్ కి కావలసిన మంచి సెటప్ కుదిరింది అంటున్నారు.

ఈ మధ్య ఏఆర్ రెహమాన్ తన మార్క్ చూపించలేకపోతున్నారు. ఆయన సంగీతం గతంలో మాదిరి మెప్పించడం లేదు. అయితే రాయన్ మూవీతో ఆయన కమ్ బ్యాక్ అయ్యాడని అంటున్నారు. రాయన్ మూవీ హైలెట్స్ లో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా ఒకటి అని ప్రేక్షకుల అభిప్రాయం. అలాగే విలన్ గా ఎస్ జె సూర్య తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నాడు. ధనుష్-ఎస్ జే సూర్య కాంబినేషన్ సీన్స్ ఆకట్టుకున్నాయట.

హీరో సందీప్ కిషన్ కి రాయన్ లో మంచి పాత్ర దక్కిందన్న టాక్ వినిపిస్తుంది. కెరీర్ బిగినింగ్ నుండి సందీప్ కిషన్ తమిళ చిత్రాలు కూడా చేస్తున్నారు. రాయన్ తో సందీప్ కిషన్ కోలీవుడ్ లో మరింత గుర్తింపు తెచ్చుకోవచ్చని అంటున్నారు. కథ, కథనాలు బాగున్నాయి. మూవీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయం.

రాయన్ మూవీ పతాక సన్నివేశాలు బాగున్నాయి. కంటెంట్ ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అయ్యిందన్న అభిప్రాయం వినిపిస్తుంది. రాయన్ మూవీతో ధనుష్ మంచి విజయం ఖాతాలో వేసుకున్నాడన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. నటుడిగానే కాకుండా ధనుష్ దర్శకుడిగా కూడా సక్సెస్ అయ్యాడు. తన 50వ చిత్రాన్ని ప్రేక్షకులు మెచ్చే విధంగా తెరకెక్కించడంలో సఫలం అయ్యాడని ప్రేక్షకుల వాదన.

తెలుగులో కూడా ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కుతుంది. రాయన్ ఫలితం ఏమిటో తెలియాలంటే పూర్తి రివ్యూ వస్తే కానీ తెలియదు. సోషల్ మీడియాలో మాత్రం సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. రాయన్ ఈ వారానికి మూవీ లవర్స్ కి బెస్ట్ ఛాయిస్ అనడంలో సందేహం లేదు.