spot_img
Homeఎంటర్టైన్మెంట్Raashi Khanna: స్లీవ్ లెస్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసే గ్లామర్... రాశి ఖన్నాను...

Raashi Khanna: స్లీవ్ లెస్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసే గ్లామర్… రాశి ఖన్నాను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు! వైరల్ ఫోటోలు

Raashi Khanna: రాశి ఖన్నా కెరీర్ ఒడిదుడుకుల మధ్య సాగుతుంది. తెలుగులో ఆమెకు ఇక ఆఫర్స్ రానట్లే. వరుస పరాజయాలతో టాలీవుడ్ కి దూరం అయ్యింది. 2013లో రాశి ఖన్నా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. ఆమె రెండో చిత్రం మనం. అక్కినేని హీరోల ఈ మల్టీస్టారర్ లో రాశి ఖన్నా గెస్ట్ రోల్ చేసింది. దర్శకుడు శ్రీనివాస్ అవసరాల ఊహలు గుసగుసలాడే చిత్రంలో నాగ శౌర్యకు జంటగా తీసుకున్నారు. ఊహలు గుసగుసలాడే మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది.

జయాపజయాలతో సంబంధం లేకుండా రాశి ఖన్నాకు ఆఫర్స్ వచ్చాయి. జోరు, జిల్, శివమ్, హైపర్, సుప్రీమ్… ఇలా టైర్ టు హీరోల పక్కన వరుస పెట్టి చిత్రాలు చేసింది. జై లవకుశ చిత్రంతో ఏకంగా ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. రాశి ఖన్నా నటించిన ఏకైక టాప్ హీరో ఎన్టీఆర్ కావడం విశేషం. దర్శకుడు బాబీ తెరకెక్కించిన జై లవకుశ హిట్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ ఆమెకు స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వలేదు. 2019లో రాశి ఖన్నా కెరీర్ పీక్స్ కి చేరింది.

ఆ ఏడాది రాశి నటించిన ప్రతిరోజూ పండగే, వెంకీ మామ హిట్ అయ్యాయి. ముఖ్యంగా మారుతి తెరకెక్కించిన ప్రతిరోజూ పండగే భారీ హిట్ కొట్టింది. రూ. 35 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ మూవీలో ఏంజెల్ ఆర్నా పాత్రలో అదరగొట్టింది. వెంకీ మామ సైతం విజయం సాధించింది. అప్పుడే రాశి ఖన్నా పప్పులో కాలేసింది. విజయ్ దేవరకొండకు జంటగా వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం చేసింది. ఈ మూవీలో రాశి ఖన్నా శృంగార సన్నివేశాల్లో నటించడం విశేషం. గతంలో ఎన్నడూ చేయని ఛాలెంజింగ్ రోల్ చేసింది.

వరల్డ్ ఫేమస్ లవర్ డిజాస్టర్ కావడం రాశి ఖన్నాకు మైనస్ అయ్యింది. ఆ దెబ్బతో టాలీవుడ్ కి ఓ రెండేళ్లు దూరం అయ్యింది. కోలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. ప్రస్తుతం హిందీలో చిత్రాలు చేస్తుంది. బాలీవుడ్ లో ఎదిగే ప్రయత్నం చేస్తుంది. బాలీవుడ్ పై కన్నేశాక రాశి ఖన్నా స్లిమ్ అయ్యింది. అదే సమయంలో గ్లామరస్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. తాజాగా రాశి ఖన్నా రెడ్ స్లీవ్ లెస్ బాడీ కాన్ డ్రెస్ లో సూపర్ గ్లామరస్ గా దర్శనం ఇచ్చింది. రాశి అందం చూస్తే కళ్ళు తిప్పుకోవడం కష్టం అన్నట్లుగా ఉంది. రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Raashii Khanna (@raashiikhanna)

RELATED ARTICLES

Most Popular