https://oktelugu.com/

రకుల్ పై రాశీ ఖన్నా జెలసీ !

హీరోయిన్ రాశీ ఖన్నాకి మంచి ఫాలోయింగ్ ఉంది, గుడ్ గ్లామర్ ఉంది. అయినా, ఎందుకో రోజురోజుకూ అమ్మడికి అవకాశాలు మాత్రం రావడం లేదు. వచ్చే ఛాన్స్ లు కూడా చిన్నాచితకా హీరోల సినిమాల్లో మిగిలిపోయిన క్యారెక్టర్స్ వస్తున్నాయి. అసలు తన చూపు కోసం కుర్రాళ్ళు కలలు కంటారు, పైగా ఒక స్టార్ హీరోయిన్ కి ఉన్న రేంజ్ తనకు ఉన్నా, సరిగ్గా తనని వాడుకోవట్లేదు అనే బాధ రాశిలో చాల ఏళ్ల నుండి బాగా ఉందట. మొత్తానికి […]

Written By:
  • admin
  • , Updated On : February 12, 2021 / 07:06 PM IST
    Follow us on


    హీరోయిన్ రాశీ ఖన్నాకి మంచి ఫాలోయింగ్ ఉంది, గుడ్ గ్లామర్ ఉంది. అయినా, ఎందుకో రోజురోజుకూ అమ్మడికి అవకాశాలు మాత్రం రావడం లేదు. వచ్చే ఛాన్స్ లు కూడా చిన్నాచితకా హీరోల సినిమాల్లో మిగిలిపోయిన క్యారెక్టర్స్ వస్తున్నాయి. అసలు తన చూపు కోసం కుర్రాళ్ళు కలలు కంటారు, పైగా ఒక స్టార్ హీరోయిన్ కి ఉన్న రేంజ్ తనకు ఉన్నా, సరిగ్గా తనని వాడుకోవట్లేదు అనే బాధ రాశిలో చాల ఏళ్ల నుండి బాగా ఉందట. మొత్తానికి తానూ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. కాలేకపోవడానికి ఇప్పుడు తీరిగ్గా కారణాలు వెతుక్కుంటుందట.

    Also Read: సక్సెస్ కోసం స్టార్ డైరెక్టర్ కష్టాలు !

    ఇంతకీ ఏమిటి ఆ కారణాలు అంటే.. మొదట్లో తానూ ఎక్స్ పోజింగ్ కి నో చెప్పడం, కాస్త కూడా లౌక్యం చూపించలేకపోవడం ఇలాంటి కొన్ని వాటి వల్ల తన కెరీర్ దెబ్బ తిందని రాశి ఇప్పుడు ఫీల్ అవుతూ కూర్చుంది. అయినా అమ్మడు మొహానికి రంగు వేసుకోవడం మొదలుపెట్టి పదేళ్లు దాటుతున్నా, ఈ మాత్రం అవగాహన లేకపోతే ఎలా ? పైగా తానూ పెద్దగా సంపాధించింది కూడా ఏమి లేదు. తనతో పాటే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్ళు బాగా సంపాధించిందని జెలసీ ఫీల్ అవుతుందట రాశి.

    Also Read: మళ్ళీ అక్కడే షూటింగ్.. బాలయ్య సెంటిమెంట్ వల్లే !

    రకుల్ అంటే అడ్డుఅదువు లేకుండా గ్లామర్ ను కురిపించేసి.. బాగానే వెనకేసుకుంది. పైగా వ్యాపారులు కూడా మొదలెట్టి లాభాల లెక్కల్లో మునిగితేలుతుంది. నిజంగానే రకుల్ ప్రీత్ సింగ్ తో రాశీ పరిస్థితి చూస్తే మాత్రం ఎక్కడ మొదలైందో అక్కడే అన్నట్టు ఉంది పరిస్థితి. అందుకే ఈ మొత్తం వ్యవహారంలో రాశీ అర్ధం చేసుకున్న పాయింట్ ఏమిటంటే .. ఎక్స్ పోజింగ్ విషయంలో ఇక తానూ రెచ్చిపోవాలని.. నిర్ణయించుకుని రీసెంట్ గా బికినీ వేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చెయ్యడం మొదలుపెట్టింది. పాపం రాశి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్