https://oktelugu.com/

ట్రైలర్ టాక్: డబ్బుల కోసం తాపత్రయంతో జైలుపాలయ్యే ‘జాతిరత్నాలు’

మంచి కథ, కథనాలు ఉంటే దర్శకులు కూడా కొత్త వారిని ప్రోత్సహిస్తున్న పరిస్థితి నెలకొంది. దిగ్గజ దర్శకుడు సుకుమార్ తన అసిస్టెంట్ బుచ్చిబాబుతో ‘ఉప్పెన’ తీశాడు. ఆ కోవలోనే ‘మహానటి ’ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా మారి స్వప్న సినిమాస్ బ్యానర్ పై అనుదీప్ ను దర్శకుడిగా పెట్టి ‘జాతిరత్నాలు’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ నవీన్ పొలిశెట్టి, కమెడియన్స్ రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలతో ‘జాతిరత్నాలు’ రూపొందింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : February 12, 2021 / 06:37 PM IST
    Follow us on

    మంచి కథ, కథనాలు ఉంటే దర్శకులు కూడా కొత్త వారిని ప్రోత్సహిస్తున్న పరిస్థితి నెలకొంది. దిగ్గజ దర్శకుడు సుకుమార్ తన అసిస్టెంట్ బుచ్చిబాబుతో ‘ఉప్పెన’ తీశాడు. ఆ కోవలోనే ‘మహానటి ’ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా మారి స్వప్న సినిమాస్ బ్యానర్ పై అనుదీప్ ను దర్శకుడిగా పెట్టి ‘జాతిరత్నాలు’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు.

    ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ నవీన్ పొలిశెట్టి, కమెడియన్స్ రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలతో ‘జాతిరత్నాలు’ రూపొందింది. ఫరియా అబ్ధుల్లా హీరోయిన్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ లు సినిమాపై ఆసక్తిని కలిగించాయి.

    ఈ చిత్రాన్ని శివరాత్రి కానుకగా మార్చి 11న విడుదల చేస్తున్నట్టు చిత్రం యూనిట్ తెలిపింది. తాజాగా జాతిరత్నాలు ‘ట్రైలర్’ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ట్రైలర్ లో ముగ్గురు హీరోలు సంకెళ్లతో కనిపించడం.. వారి పేర్లు, వారి బాడీ లాంగ్వేజ్, డైలాగులు అన్నీ డిఫెరెంట్ గా ఉంటూ వచ్చాయి. ప్రియదర్శి చెప్పే ఫన్నీ డైలాగ్ ట్రైలర్ అలరించింది.

    ఇక హీరో నవీన్ కూడా కామెడీతో అలరించాడు. ముగ్గురిలో ఒకరు చనిపోయినా ఇద్దరు హ్యాపీగా ఉంటామని చెప్పిన డైలాగ్ నవ్వులు పూయించింది. మొత్తం ముగ్గురు జాతిరత్నాలు చేసే అల్లరి కామెడీ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లాయని అర్థమవుతోంది. మరి ట్రైలర్ చూశాక వీరి కామెడీ థియేటర్స్ లో ఏమేరకు కామెడీ పండిస్తుందో చూడాలి.