Homeఆంధ్రప్రదేశ్‌Duvvada Srinivas: 'దువ్వాడ' కష్టాన్ని గుర్తించని 'ధర్మాన'!

Duvvada Srinivas: ‘దువ్వాడ’ కష్టాన్ని గుర్తించని ‘ధర్మాన’!

Duvvada Srinivas: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకునే ప్రయత్నంలో ఉంది. అయితే ఆ పార్టీ ప్రజా పోరాటాలు చేయడం లేదన్న విమర్శ ఉంది. ఎంతవరకు ఆ పార్టీ శ్రేణుల అరెస్టు, కేసుల మీద పోరాటం తప్ప.. ప్రెస్ మీట్ లు పెట్టి ప్రభుత్వం పై విమర్శలు చేయడం తప్ప.. సీనియర్ నేతలు పెద్దగా పనిచేయడం లేదన్న విమర్శ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. తాజాగా ఆయన తమ పార్టీకి చెందిన నేత ఒకరిని కేసులు పెట్టి జైల్లో పెట్టడాన్ని తప్పుపడుతూ పరామర్శించారు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి పోలీసు విచారణ ఎదుర్కొంటున్న దువ్వాడ శ్రీనివాస్ ను మాత్రం కనీసం పలకరించడం లేదు. పైగా జగనన్న అధికారంలోకి వస్తే తన తడాఖా చూపిస్తాను అంటూ మాట్లాడుతున్నారు దువ్వాడ శ్రీనివాస్.

– విచారణకు హాజరు..
మొన్న మధ్యన శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ లో దువ్వాడ శ్రీనివాస్ ను విచారించారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని వచ్చిన ఫిర్యాదు పై పోలీసులు నోటీసులు అందించారు. దువ్వాడ శ్రీనివాస్ విచారణకు హాజరయ్యారు. రోజంతా హైడ్రామా నెలకొంది. తర్వాత మరోసారి విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. కానీ పోలీస్ స్టేషన్కు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్ అక్కడకు చేరుకోలేదు. ఆయన ఒడిస్సాలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. దువ్వాడ శ్రీనివాసును పోలీసుల దాచి ఇలా చేస్తున్నారు అంటూ ఆయన సహచరి మాధురి ఆరోపించారు. దువ్వాడ శ్రీనివాస్ తో పాటు భారతిని వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపాయి. గాని జిల్లాలో పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న ధర్మాన ప్రసాదరావు పరామర్శించిన దాఖలాలు లేవు.

* సామాన్య కార్యకర్తకు పరామర్శ..
అయితే తాజాగా ధర్మాన ప్రసాదరావు కూటమి ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమికి నష్టం తప్పదని హెచ్చరించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తప్పుపట్టారు. జైలుకు వెళ్లి ఆయనను పరామర్శించారు. అయితే తాను జగన్మోహన్ రెడ్డి భక్తుడినని.. జగన్ వస్తే మళ్లీ ప్రత్యర్థులను తాటతీస్తామని హెచ్చరిస్తున్నారు దువ్వాడ. ఒకవైపు ఆయన కు మద్దతుగా వైసీపీ శ్రేణులు వస్తున్నారు. దువ్వాడతోపాటు మాధురి జగన్మోహన్ రెడ్డి పట్ల అనుకూల ప్రకటనలు చేస్తున్నారు. తన జైలు జీవితమంతా జగన్ కోసమే అన్నట్టు దువ్వాడ చెబుతున్నారు. కానీ ఒక సామాన్య కార్యకర్తకు జైలుకు వెళ్లి పరామర్శించిన ధర్మాన.. దువ్వాడ శ్రీనివాస్ బాధను, పోరాటాన్ని అర్థం చేసుకోవడం లేదు. కానీ గొప్ప పలుకులు వల్లె వేస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version