https://oktelugu.com/

విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిన కరోనా.. సర్వేలో సంచలన విషయాలు..?

దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుతోంది. 10,000 కంటే తక్కువగా కరోనా కేసులు నమోదవుతూ ఉండగా 100 కంటే తక్కువగా మరణాలు నమోదవుతున్నాయి. విద్యారంగంపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపింది. అయితే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దేశంలోని ప్రైవేట్ పాఠశాలలతో పాటు ప్రభుత్వ పాఠశాలలు కూడా తెరుచుకుంటున్నాయి. Also Read: రూ.4వేలకే కరోనా వ్యాక్సిన్.. ఆఫర్లతో ఫేక్ వెబ్ సైట్.. కేంద్రం కీలక ప్రకటన అయితే కరోనా వల్ల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 13, 2021 11:53 am
    Follow us on

    Students After Lockdown

    దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుతోంది. 10,000 కంటే తక్కువగా కరోనా కేసులు నమోదవుతూ ఉండగా 100 కంటే తక్కువగా మరణాలు నమోదవుతున్నాయి. విద్యారంగంపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపింది. అయితే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దేశంలోని ప్రైవేట్ పాఠశాలలతో పాటు ప్రభుత్వ పాఠశాలలు కూడా తెరుచుకుంటున్నాయి.

    Also Read: రూ.4వేలకే కరోనా వ్యాక్సిన్.. ఆఫర్లతో ఫేక్ వెబ్ సైట్.. కేంద్రం కీలక ప్రకటన

    అయితే కరోనా వల్ల దాదాపు తొమ్మిది నెలల పాటు చాలామంది విద్యార్థులు స్కూళ్లకు దూరమయ్యారు. స్కూళ్లు తెరుచుకున్న తరువాత అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ చేసిన ఒక సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థులు తొమ్మిది నెలల పాటు చదువుకు దూరం కావడంతో కొన్ని కీలకమైన విషయాలను మరిచిపోయారని ఈ సర్వేలో తేలింది. విద్యార్థులు చాలా అంశాల్లో సామర్థ్యాన్ని కోల్పోయారని వెల్లడైంది.

    Also Read: కరోనా అలర్ట్.. ఆ ప్రాంతంలో 192 మంది విద్యార్థులకు పాజిటివ్..?

    82 శాతం మంది విద్యార్థులు నిర్దిష్ట సామర్థ్యాన్ని కోల్పోయారని.. 48 శాతం మంది పిల్లలు కూడికలు, తీసివేతలను మరిచిపోయారని 50 శాతం మంది విద్యార్థులు మౌఖిక ప్రశ్నలకు సమాధానం చెప్పే సామర్థ్యాన్ని కోల్పోయారని తేలింది. కొందరు విద్యార్థులు సింగిల్ డిజిట్ సంఖ్యను గుర్తించలేక పోతుంటే మరి కొందరు విద్యార్థులు ‘గడియారం’లో చూసి సరైన టైమ్ ను కూడా చెప్పలేకపోయారని సమాచారం.

    మరిన్ని వార్తలు కోసం: కరోనా వైరస్

    విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని కరోనా మహమ్మారి తీవ్రంగా దెబ్బ తీసిందనే చెప్పాలి. అయితే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే మాత్రమే కరోనా, లాక్ డౌన్ వల్ల విద్యార్థులు కోల్పోయిన నైపుణ్యాలను తిరిగి పొందే అవకాశం ఉంటుంది.