https://oktelugu.com/

Allu Arjun Arrested: అల్లు అర్జున్ ను కలిసి ఎమోషనల్ అయిన ఆర్ నారాయణ మూర్తి…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు ఉన్నప్పటికి వాళ్లను పక్కన పెట్టి మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. ఇక ఈయన చేసిన సినిమాకు నెక్స్ట్ లెవెల్లో ఆదరణ అయితే దక్కుతుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని అందుకున్న ఆయన ఇప్పుడు పుష్ప 2 సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : December 14, 2024 / 05:26 PM IST

    Allu Arjun Arrested(31)

    Follow us on

    Allu Arjun Arrested: అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ద్వారా చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక అలాగే కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న అల్లు అర్జున్ ఇప్పుడు మరోసారి వివాదాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. పుష్ప 2 సినిమాకి ముందు నుంచే భారీ హైప్ అయితే ఉంది. ఇక ఎప్పుడైతే పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది ఆయన క్రేజ్ మరింత పెరిగింది. ఇక మొదటి షో నుంచే సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకొని ముందుకు సాగుతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ రోజు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట లో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఇక దానికి తగ్గట్టుగానే ఆయనను రీసెంట్ గా అరెస్ట్ చేశారు. దాంతో పాటుగా హైకోర్టు అతనికి బెయిల్ ఇవ్వడంతో ఆయన ఈరోజు ఇంటికి తిరిగివచ్చారు. మరి మొత్తానికైతే ఆయన ఇంటికి వచ్చిన తర్వాత కొంతమంది సినీ సెలబ్రిటీలు సైతం అతన్ని పరామర్శిస్తున్నారు. ఇక అందులో భాగంగానే పీపుల్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్న ఆర్.నారాయణమూర్తి కూడా అల్లు అర్జున్ ను కలిసి మాట్లాడారు. ఇక ఆ మాటల్లోనే నారాయణమూర్తి కొంతవరకు ఎమోషనల్ అయ్యాడు. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసిన వెంటనే యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం స్పందించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

    ఇక మెగా ఫ్యామిలీ కూడా హుటాహుటిన వచ్చి అల్లు అర్జున్ కి భరోసాని ఇస్తూ ఆయన పక్షాన నిలవడం అనేది నిజంగా గొప్ప విషమనే చెప్పాలి. ఇక గత కొద్ది రోజుల నుంచి వీళ్ళ మధ్య విబేధాలు ఉన్నాయి అంటూ కొన్ని కామెంట్లైతే వస్తున్నాయి. ఇక వాటికి చెక్ పెడుతూనే చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి నటులు అల్లు అర్జున్ ను కాపాడుకోవడానికి చాలా వరకు ప్రయత్నం అయితే చేస్తున్నారు.

    ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు సినిమాలు చేస్తున్నప్పటికి అల్లు అర్జున్ మాత్రం నెక్స్ట్ లెవెల్ సినిమాలను చేస్తున్నాడు. ఇక పుష్ప 2 సినిమాతో చాలా తక్కువ రోజుల్లోనే 1000 కోట్లకు పైన కలెక్షన్లను సాధించిన హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

    మరి ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంత కలెక్షన్స్ ను వసూలు చేస్తుందనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక అల్లు అర్జున్ ఈ కేసు ముగిసిన వెంటనే త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాకు సంబంధించిన కసరత్తులను చేస్తాడట… ఇక ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…