Pushpa The Rule:స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో హెవీ బడ్జెట్‌తో తెరకెక్కిిన ఈ సినిమా డిసెంబరు 17న విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. థియేటర్లలోకి వచ్చిన తొలిరోజే మాస్ కలెక్షన్లతో ప్రభంజనం సృష్టించింది. సుమారు 34 కోట్లకుపైగా తొలి రోజు వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. తెలుగు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కాగా, ఈ సినిమా విజయవంతం కావడంతో నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తొలి భాగాన్ని పుష్ప ది రైజ్ టైటిల్‌తో విడుదల చేయగా.. రెండో భాగాన్ని పుష్ప ద రూల్ పేరుతో తీసుకురానున్నారు. తాజా సమాచారం ప్రకారం రెండో పార్ట్‌ను ఫిబ్రవరి నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు నిర్మాతలు తెలిపారు. అయితే, ఫస్ట్ పార్ట్ విడుదల విషయంలో హడావిడి జరగడం వల్ల.. టెక్నికల్ లోపాలు వచ్చిన మాట నిజమేనని నిర్మాతలు అంటున్నారు. కానీ, సెంకడ్ పార్ట్ విషయంలో ప్రేక్షకులను నిరాశపరిచేది లేదని.. అన్ని జాగ్రత్తలు తీసుకుని.. రెండు నెలలు ముందుగానే సిద్దం చేసి మరీ పుష్ప ఫెస్టివల్నుక్రియేట్ చేస్తామని హామీ ఇచ్చారు.
కాగా, పుష్ప తొలి భాగం హిందీ వర్షన్ విషయంలో కూడా మొదట్లో ఇబ్బంది ఎదురైంది. అన్నీ అనుకున్నట్లు జరిగింటే.. బాలీవుడ్లో తొలిరోజు వసూల్లు చేసిన దానికంటే రెట్టింపు వసూళ్లు వచ్చిండేవని నిర్మాతలు చెబుతున్నారు. మరి ఏ మేరకు సెకండ్‌పార్ట్‌ను రసవత్తరంగా తెరకెక్కిస్తారో చూడాలి మరి.
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More