ఈ సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ బాధ్యతు చేపట్టింది. నిర్మాత నవీన్ యెర్నేని స్పందిస్తూ.. పెద్ద పెద్ద హీరోలు, దర్శకుల సినిమాలకు మూడు గంటల రన్‌టైమ్ సాధారణమని.. గతంలో రంగస్థలం సనినిమా కూడా ఇలాగే రన్‌టైమ్ వేసినట్లు గుర్తు చేశారు. సినిమా అన్నాక అక్కడక్కడా కాస్త లాగ్ ఉండటం సహజమని.. కానీ, కథకు తగ్గట్లు సన్నివేశాలు ఉండాలంటే.. ఆ మాత్రం రన్‌టైమ్ అవసరమని అన్నారు. ప్రేక్షకులైతే దాని గురించి ఎలాంటి ఆందోళన చెందరని.. తాము డబ్బుకోసం పాకులాడే వ్యక్తులం కాదని తెలిపారు. అలాగైతే రన్‌టైమ్ తగ్గించి.. రోజుకు 5 షోలు వేయించే సత్తా కూడా ఉందని అన్నారు. 3 గంటల రన్‌టైమ్ కారణంగానే 4 షోలు మాత్రమే వేశారన్నారు… ఇలా సినిమా రన్‌టైమ్‌పై వస్తున్న భిన్నాభిప్రాయాలపై తనదైన స్టైల్లో వివరణ ఇచ్చారు నిర్మాత.
కాగా, రెండో భాగాన్ని ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం. మరోవైపు పుష్ప ది రైజ్‌ను సంక్రాంతి కానుకగా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్ల తెలుస్తోంది.