Pushpa: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ “పుష్ప”.ఈ నెల 17న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. మూడు రోజులకు గానూ ఈ సినిమా ఏకంగా రూ. 173 కోట్లపైగానే గ్రాస్ కలెక్షన్స్ సాధించింది రికార్డును సృష్టించింది. అందులోని బన్నీ పెర్ఫార్మెన్స్ ఒక రేంజ్ లో ఉండటంతో సినీ తారలు నుండి అభిమానులు వరకు అల్లు అర్జున్ నటనకు ఫిదా అవుతున్నారు. ఇటీవలే విజయ్ దేవరకొండ, నితిన్ లాంటి యంగ్ హీరోలు బన్నీ ఒన్ మేన్ షోకి ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

అయితే ఇదే క్రమంలో ” అర్జున్‌రెడ్డి” యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా “పుష్ప” సినిమాను తాజాగా వీక్షించారు.ఈ సినిమాలో పుష్ప గా అల్లు అర్జున్ నటన అమేజింగ్ అంటూ ట్వీట్ చేశారు. “అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ హైపర్ సానిక్ మిస్సైల్ కన్నా ఏమీ తక్కువ కాదు.
జనమంతా పుష్ప సినిమా చూసి అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కు స్డాండింగ్ ఒవేషన్ ఇవ్వండి. అతడింకా ఇలాంటి ఎన్నో ఒవేషన్స్ కి అర్హుడు.ఈ సినిమా చరిత్రలోనే బన్నీది అత్యుత్తమ ప్రదర్శన” అంటూ సందీప్ రెడ్డి ట్వీట్ చేశారు.అలానే బన్నీ నటనపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం సందీప్ భారీ అంచనాలతో “స్పిరిట్” అనే పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.