https://oktelugu.com/

Pushpa Team: కెజిఎఫ్ ఫార్మాట్ ఫాలో అవుతున్న పుష్ప టీమ్… పార్ట్ 3 ఉంది కానీ!

Pushpa Team: బన్నీ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ ఏంటంటే.. పుష్ప పార్ట్ 3 కూడా ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. పుష్ప ది రోర్ అనే టైటిల్ తో పార్ట్ 3 ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని సమాచారం.

Written By:
  • S Reddy
  • , Updated On : May 28, 2024 / 02:07 PM IST

    Pushpa team following KGF format

    Follow us on

    Pushpa Team: దర్శకుడు సుకుమార్(Sukumar)-ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం రెండు పార్టులుగా రూపొందుతుంది. మొదటి భాగం పుష్ప ది రైజ్ 2021లో రిలీజైన విషయం తెలిసిందే. పుష్ప సీక్వెల్ పుష్ప 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పుష్ప ది రూల్(Pushpa The Rule) ఆగష్టు 15న ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా ఉన్న బన్నీ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

    బన్నీ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ ఏంటంటే.. పుష్ప పార్ట్ 3 కూడా ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. పుష్ప ది రోర్ అనే టైటిల్ తో పార్ట్ 3 ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని సమాచారం. మొదటి భాగంలో పుష్ప ఎలా ఎదిగాడు. పార్ట్ 2లో తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడు అనేది చూపించబోతున్నారు. ఇక మూడవ భాగంలో పుష్ప తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి చేసే యుద్ధంతో మూవీని ముగించనున్నారట.

    Also Read: Jr NTR: తాతయ్య జయంతి… సంచలనంగా జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా పోస్ట్!

    కాగా ఈ విషయంలో కేజిఎఫ్(KGF) ఫార్ములాని ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే కెజిఎఫ్ 2 తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ వేరే ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యారు. ప్రశాంత్ నీల్… ప్రభాస్ తో సలార్ 2, ఎన్టీఆర్ తో ఒక ప్రాజెక్టు చేయనున్నారు. ఇక యష్ ‘ టాక్సిక్ ‘ మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఇవి పూర్తయిన తర్వాతే కెజిఎఫ్ పార్ట్ 3 పట్టాలెక్కే అవకాశం ఉంది. కాగా పుష్ప 3 విషయంలోనూ ఇదే ఫార్ములా అమలు కానుంది.

    Also Read: Prabhas-Pawan Kalyan: ప్రభాస్ పవన్ కళ్యాణ్ కాంబో లో రానున్న మల్టీస్టారర్ మూవీ… ఇంతకీ డైరెక్టర్ ఎవరంటే..?

    పుష్ప 2 విడుదలైన వెంటనే పుష్ప 3 మొదలు కాదట. అల్లు అర్జున్ అట్లీతో ఒక మూవీ చేయనున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ తో మరో సినిమా ఉంటుంది. దర్శకుడు సుకుమార్ సైతం రామ్ చరణ్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ అంతా పూర్తవడానికి కనీసం మూడేళ్లు అయినా పడుతుంది. ఈ లెక్కన కెజిఎఫ్ 3 , పుష్ప 3 కొంచెం అటు ఇటుగా సెట్స్ పైకి వెళ్లొచ్చు.