Bhupesh Baghel: నరేంద్ర మోడీ పదిసార్లు జన్మించిన జవహర్లాల్ నెహ్రూ కాలేడట! ఎందుకే కాంగ్రెస్ మునిగేది!

కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలు బీజేపీకి కలిసి వస్తుంది. ఎప్పుడూ చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఇండీ కూటమి పని లాగుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Written By: Dharma, Updated On : May 28, 2024 2:12 pm

Bhupesh Baghel

Follow us on

Bhupesh Baghel: దేశమే కాదు.. ప్రపంచం మొత్తం కీర్తిస్తున్న నేత భారత ప్రధాని మోడీ. మోడీ ఉన్నాడంటే భయం లేదని విదేశాల భారతీయులు ధైర్యంగా ఉన్నారు. కానీ భారత్ లో ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఆరోపణలు, ప్రత్యారోపణలు విసురుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలు బీజేపీకి కలిసి వస్తుంది. ఎప్పుడూ చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఇండీ కూటమి పని లాగుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రాహుల్, మొన్నటికి మొన్న లలూ ప్రసాద్ యాదవ్. ఇలా మాటలు స్లిప్ కావడం బీజేపీకి కలిసి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత భూపేశ్ బఘేల్ చేసిన వ్యాఖ్యలు చివరి విడుత వరకు బీజేపీకి మరిన్ని ఎక్కువ సీట్లను సాధించి పెట్టేలా కనిపిస్తున్నాయి.

ప్రధాని నరేంద్ర మోడీ 10 సార్లు జన్మించినా జవహర్ లాల్ నెహ్రూ కాలేరని కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నెహ్రూను కించపరచడం ద్వారా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని చూస్తున్నారని, కానీ ఆయన నెహ్రూ కాళ్ల దుమ్ముకు కూడా సమానం కాదని ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ సీనియర్ నేత మాట్లాడుతూ.. ‘ఈ రోజుల్లో ప్రధాని తనకు ఏం కావాలన్నా మాట్లాడుతున్నారు. మా మేనిఫెస్టోను ముస్లింలీగ్, మంగళసూత్రం, చేపలు, మటన్, గేదెల ఎజెండాగా పేర్కొంటూ.. ఇప్పుడు పరమాత్మ తనను పంపించాడని, అంటే తాను మామూలు మనిషిని కాదని చెబుతున్నాడు. ఆయన మానసిక స్థితి సరిగా లేదని దీన్ని బట్టి అర్థమవుతోందన్నారు.

పాకిస్తాన్ ను రెండు ముక్కలు చేసిన నాయకుడి మనవడు రాహుల్ గాంధీ అని, కానీ మోడీ మాత్రం బిర్యానీ తినడానికి పాక్ వెళ్లారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ నెహ్రూను కించపరచడం ద్వారా ఒక స్థానాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ అతను 10 సార్లు పుట్టినా నెహ్రూ కాలేరు..’ అని బఘేల్ వ్యాఖ్యానించారు.

బ్యాలెట్ పేపర్ల యుగంలో ఎన్నికల సంఘం 24 గంటల్లో అన్ని ఓటింగ్ డేటాను విడుదల చేసేదని కాంగ్రెస్ నేత అన్నారు. కానీ డిజిటల్ యుగంలో 8-10 రోజుల తర్వాత కూడా ఓటింగ్ డేటాను కమిషన్ ఇవ్వలేదని, అలా చేసినప్పుడు పోలింగ్ శాతం 6-8 శాతం పెరిగిందన్నారు.

ఇంకా భూపేశ్ ఎలక్షన్ కమిషన్ పై కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేశారు. ‘మీరు ఎలక్ట్రానిక్ యుగంలో ఉన్నప్పుడు, మీరు పోలైన ఓట్ల సంఖ్యను ఇవ్వడం లేదు. మీరు చాలా రోజుల తరువాత పోలైన ఓట్ల శాతాన్ని విడుదల చేస్తున్నారు. 6 నుంచి 8 శాతం పెరుగుదలను చూపుతారు’. ‘మీరు ఎవరిపై అభిమానం చూపాలనుకుంటున్నారు?’ భగల్ ఈసీని నిలదీశారు.

ఏఐసీసీ నాయకుడు రాహుల్ గాంధీ నుంచి ప్రస్తుతం భూపేశ్ వరకు పెద్ద స్థాయి నాయకులు మాట్లాడిన ప్రతీ మాట బీజేపీకే ఫేవర్ గా మారుతుంది. ‘చాయ్ వాలా ప్రధాని అవుతాడా’ అన్న రాహుల్.. ‘మోడీకి కుటుంబం లేదు’ అన్న లలూ ప్రసాద్ యాదవ్.. ఇప్పుడు భూపేశ్ వీరందరి బురదతో ‘కమలం’ అంతకంతకూ వికసిస్తూనే ఉంది.