Venu Swamy: ఏపీలో కూటమిని గెలిపించనున్న కోల్ కత్తా నైట్ రైడర్స్

ఐపీఎల్ సీజన్ 17 ముగిసింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. 2012, 2014 సమయంలో సైతం కోల్కత్తా నైట్ రైడర్స్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.

Written By: Dharma, Updated On : May 28, 2024 2:05 pm

Venu Swamy

Follow us on

Venu Swamy: ఏపీలో కౌంటింగ్ కు మరో వారం రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈనెల 13న పోలింగ్ జరిగింది. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. సుమారు మూడు వారాల పాటు గడువు ఉండడంతో గెలుపోటములపై విస్తృత చర్చకు అవకాశం ఏర్పడింది. ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం కాగా.. గెలుపు పై అన్ని పార్టీల్లో ధీమా వ్యక్తం అవుతోంది. ఇక విశ్లేషకులు,సెఫాలజిస్టులు, జ్యోతిష్యులు చేస్తున్న హల్చల్ అంతా ఇంతా కాదు. మరి సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఈ తరుణంలో ఐపీఎల్ ఫలితాన్ని జత చేసుకుని జరుగుతున్న విశ్లేషణ ఆసక్తికరంగా ఉంది.

ఐపీఎల్ సీజన్ 17 ముగిసింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. 2012, 2014 సమయంలో సైతం కోల్కత్తా నైట్ రైడర్స్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. 2014లో టిడిపి, బిజెపి కలిసి పోటీ చేశాయి. జనసేన బయట నుంచి మద్దతు తెలిపింది. ఈ మూడు పార్టీలకు కూటమి అప్పట్లో అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు అదే కోల్కత్తా నైట్ రైడర్స్ విజయం సాధించడంతో.. ఏపీలో కూడా మరోసారి కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత హిస్టరీ రిపీట్ అవుతుందని కూటమి పార్టీల శ్రేణులు చెప్పుకొస్తున్నాయి.

మరోవైపు వేణు స్వామి జోష్యం సైతం జతకలుస్తోంది. హైదరాబాద్ సన్రైజర్స్ జట్టుపై భారీ అంచనాలు పెరగడంలో వేణు స్వామి ఒకరు. హైదరాబాద్ సన్రైజర్ ఓనర్ జాతకం బట్టి వేణు స్వామి జోష్యం చెప్పారు. కానీ హైదరాబాద్ సన్రైజర్స్ ఓడిపోయి కోల్కత్తా నైట్ రైడర్స్ గెలిచింది. రాజకీయంగాను చంద్రబాబు, పవన్లు ఓడిపోతున్నారని చెప్పిన వేణు స్వామి.. జగన్ వైపే మొగ్గు చూపారు. వరుసగా 17 సంవత్సరాల పాటు ఆయన సీఎంగా ఉంటారని చెప్పుకొచ్చారు. ఐపీఎల్ క్రికెట్లో వేణు స్వామి జోష్యం తప్పింది.. జగన్ విషయంలో సైతం తప్పబోతోంది అన్నది సోషల్ మీడియాలో హైలెట్ అవుతోంది. మరోవైపు కోల్కత్తా నైట్ రైడర్స్, ఏపీలో కూటమి ఫలితాలు ఒకేసారి అనుకూలంగా వచ్చాయి. ఇప్పుడు కోల్కత్తా నైట్ రైడర్స్ గెలవడంతో కూటమిదే విజయం అని టాక్ ప్రారంభమైంది. మరి ఈ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.