Homeఎంటర్టైన్మెంట్బన్నీ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. పాపం 'పుష్ప' !

బన్నీ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. పాపం ‘పుష్ప’ !

‘పుష్ప’ను బ్యాడ్ టైం వదిలిపెట్టడం లేదు. మొదట కరోనా పుష్పకు పెద్ద షాక్ ఇచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్ళు మేకర్స్ మధ్య తలెత్తిన ఇగోలు కూడా కొన్ని రోజులు పాటు పుష్పను బాగా ఇబ్బంది పెట్టాయి. ఆ తర్వాత కూడా మరి కొన్ని సమస్యలు. మొత్తానికి పుష్ప అనేక సమస్యల మధ్యనే షూటింగ్ తిరిగి మొదలు పెట్టింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉత్సాహంగానే పుష్ప సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ రోజు ఉదయం […]

Pushpa Movie‘పుష్ప’ను బ్యాడ్ టైం వదిలిపెట్టడం లేదు. మొదట కరోనా పుష్పకు పెద్ద షాక్ ఇచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్ళు మేకర్స్ మధ్య తలెత్తిన ఇగోలు కూడా కొన్ని రోజులు పాటు పుష్పను బాగా ఇబ్బంది పెట్టాయి. ఆ తర్వాత కూడా మరి కొన్ని సమస్యలు. మొత్తానికి పుష్ప అనేక సమస్యల మధ్యనే షూటింగ్ తిరిగి మొదలు పెట్టింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉత్సాహంగానే పుష్ప సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ రోజు ఉదయం వరకు హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిగింది. తాజాగా పుష్ప షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. కారణం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కి ఆరోగ్య సమస్య తలెత్తింది. సుకుమార్ కి వైరల్ ఫీవర్ సోకింది.

నిజానికి గత రెండు రోజులు నుంచి ఫీవర్ తో బాధ పడుతూనే సుక్కు షూట్ చేస్తున్నాడు. కానీ, ఈ రోజు ఫీవర్ మరీ ఎక్కువ అవ్వడంతో ఇక చేసేది ఏమి లేక సుక్కు పుష్ప షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాడు. దీంతో కొన్ని రోజులు పుష్ప సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. అయితే, ఎట్టిపరిస్థితుల్లో పుష్ప ఫస్ట్ పార్ట్ ను ఈ ఏడాదే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు.

ఈ లెక్కన పుష్ప షూటింగ్ ఇలాగే పోస్ట్ ఫోన్ అవుతూ వెళ్ళితే.. ఇక ఈ సినిమా షూట్ ఎప్పటికి పూర్తి అవుతుంది. మరోపక్క ‘ఐకాన్’ సినిమాని మొదలుపెట్టాలని బన్నీ ఇప్పటికే షెడ్యూల్స్ కూడా రెడీ చేసుకున్నాడు. మొత్తానికి పుష్పకి మొదటి నుండి అనేక అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి, పాపం పుష్ప.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper