https://oktelugu.com/

Bigg Boss 5: బిగ్ బాస్ గ్రాండ్ ఫీనాలే ను గట్టిగా ప్లాన్ చేసిన మేకర్స్… గెస్ట్ లుగా ఎవరంటే ?

Bigg Boss 5: బిగ్ బాస్ సీజన్ 5 చివరి ఎపిసోడ్ కి చేరుకుంది. మరి కొద్దిగంటల్లో బిగ్ బాస్ సీజన్ 5 విజేత ఎవరో తెలిసిపోనుంది. ఈ గ్రాండ్ ఫినాలేను భారీగా ప్లాన్ చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఈ సీజన్ తో హౌస్ట్ గా నాగార్జున విజయవంతంగా తన మూడో సీజన్ ను పూర్తి చేశారు. మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆతర్వాత బిగ్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 19, 2021 / 04:40 PM IST
    Follow us on

    Bigg Boss 5: బిగ్ బాస్ సీజన్ 5 చివరి ఎపిసోడ్ కి చేరుకుంది. మరి కొద్దిగంటల్లో బిగ్ బాస్ సీజన్ 5 విజేత ఎవరో తెలిసిపోనుంది. ఈ గ్రాండ్ ఫినాలేను భారీగా ప్లాన్ చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఈ సీజన్ తో హౌస్ట్ గా నాగార్జున విజయవంతంగా తన మూడో సీజన్ ను పూర్తి చేశారు. మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆతర్వాత బిగ్ బాస్ సీజన్ 2 కి నాని హోస్ట్ గా చేశారు. ఆ తర్వాత 3, 4 సీజన్స్ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు నాగ్. ఈ సీజన్ 5 వరకు విమర్శలు, పొగడ్తలతో దిగ్విజయంగా ముగిస్తున్నారు. బిగ్ బాస్ 5 గ్రాండ్ ఫినాలే ఈవెంట్ తాజా ప్రోమోను విడుదల చేశారు.

    ఇక గ్రాండ్ ఫినాలేకు భారీ తారాగణం హాజరు కానున్నారు. వీరిలో బాలీవుడ్ స్టార్స్ రణ్ బీర్ కపూర్, అలియా భట్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. అలాగే దర్శక ధీరుడు రాజమౌళి కూడా హాజరయ్యారు. బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రణ్‌బీర్- అలియా హాజరయ్యారు. అలాగే శ్యామ్ సింగరాయ్ సినిమాప్రమోషన్స్ లో భాగంగా నేచురల్ స్టార్ నాని, కృతి శెట్టి, సాయి పల్లవి హాజరయ్యారు. అలాగే పుష్ప సినిమా ప్రమోషన్స్ నేపథ్యంలో సుకుమార్, దేవీశ్రీ ప్రసాద్, రష్మిక మందన్న బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. శ్రీయ, డింపుల్ హయతి తమ డ్యాన్స్‌లతో అదరగొట్టారు. ఇదిలా ఉంటే గత రెండు సీజన్స్ విజేతలను మెగాస్టార్ చిరంజీవి అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి కూడా మెగాస్టార్ ను రప్పించనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి నిజమో కాదో తెలియాలంటే మరి కొన్ని గంటలు ఆగక తప్పదు.