Pushpa 2 The Rule Trailer : పుష్ప 2 టీజర్: అమ్మవారిలా అల్లు అర్జున్ అరాచకం

సూపర్ పాపులర్ గంగమ్మ తల్లి జాతరలోని సన్నివేశాలతో సెట్ చేయబడిన ఈ టీజర్‌లో అల్లు అర్జున్ అమ్మవారిలా చీర-గెటప్‌ను ధరించాడు. బన్నీ మేకప్, ఆ ఎలివేషన్ ను వర్ణించడానికి పదాలు లేకుండా పోయాయి. సూపర్ స్టన్నింగ్ విజువల్స్ ను ట్రైలర్ లో చూపించారు.

Written By: NARESH, Updated On : April 8, 2024 12:02 pm

Pushpa 2 The Rule Trailer Review

Follow us on

Pushpa 2 The Rule Trailer : అల్లు అర్జున్ పాన్-ఇండియా చిత్రం, బ్లాక్ బస్టర్ పుష్పకు సీక్వెల్, ఆగష్టు 15 న విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. “పుష్ప 2: ది రూల్” అనే టైటిల్‌తో ఈ చిత్రం టీజర్ ను తాజాగా బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు విడుదల చేశారు. ఇది మాస్ జాతరతో నిండి ఉందని వీడియో చూస్తే అర్థమవుతోంది.

సూపర్ పాపులర్ గంగమ్మ తల్లి జాతరలోని సన్నివేశాలతో సెట్ చేయబడిన ఈ టీజర్‌లో అల్లు అర్జున్ అమ్మవారిలా చీర-గెటప్‌ను ధరించాడు. బన్నీ మేకప్, ఆ ఎలివేషన్ ను వర్ణించడానికి పదాలు లేకుండా పోయాయి. సూపర్ స్టన్నింగ్ విజువల్స్ ను ట్రైలర్ లో చూపించారు.

అల్లు అర్జున్ ఒక విలన్ ని తన్నినప్పుడు, ఆపై కుంకుమ లేసి ఉన్న నేలపైకి అడుగుపెట్టినప్పుడు సీన్లు హైలెట్ గా నిలిచాయి. దర్శకుడు సుకుమార్ బన్నీ అభిమానుల అంచనాలు అందుకునేలా ఈ టీజర్ ను రూపొందించాడు. పాన్-ఇండియా లెవల్ లో ఆకట్టుకున్నాడనే చెప్పాలి. అద్భుతమైన విజువల్స్, సౌండ్ , దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పాటు రెడ్ కలర్ ప్యాలెట్ చాలా బాగా మెప్పించింది.

అల్లు అర్జున్, ఫాహద్ ఫాసిల్, రష్మిక మందన్న, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప 2 ఆగస్ట్ 15న విడుదల కానుంది. ఈ పుష్ప2లో అక్రమార్జన , ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ కథ నడుస్తుంది.. పుష్ప1 ను మించి పుష్ప2 భారతదేశాన్ని మళ్లీ ఊపేస్తున్నట్లు కనిపిస్తోంది.