BBC: తినేది ఇంటి తిండి.. పాడేది పరాయి ఇంటి పాట.. ఇన్నాళ్లపాటు బీబీసీ(బ్రిటిష్ బ్రాడ్ కాస్ట్ కార్పొరేషన్) వ్యవహారం అలాగే సాగింది. భారతదేశం మీద విషం చిమ్మడం.. అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాల అనుకూల ఎజెండా ఈ దేశంలో అమలు.. వంటివి నిరాటంకంగా ఇన్ని రోజులపాటు బీబీసీ అమలు చేసింది. అక్కడిదాకా ఎందుకు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై డాక్యుమెంటరీలు రూపొందించింది.. దీంతో బీబీసీ అసలు రూపాన్ని నరేంద్ర మోడీ తవ్వడం ప్రారంభించారు. పన్నులు ఎగ్గొట్టడం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం, భారతదేశంలో కార్యకలాపాలు సాగిస్తూనే.. ఈ దేశ ప్రభుత్వం పై అడ్డగోలుగా వార్తలు ప్రసారం చేయడం వంటివి వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలకు పాల్పడినందుకు బీబీసీ మీద ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు చేశారు. దాని అసలు రూపాన్ని బయటపెట్టారు. దీంతో అది తట్టుకోలేక సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ కూడా సాంత్వన లభించకపోవడంతో దెబ్బకు పీచేమూడ్ అయింది. మోడీ ఇచ్చిన స్ట్రోక్ కు తత్వం బోధపడింది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం..
మన దేశం నిబంధనల ప్రకారం విదేశీ మీడియా.. మన దేశ విధానాలను తప్పు పట్టకూడదు. అడ్డగోలుగా వార్తలు ప్రసారం చేయకూడదు. దేశ సార్వభౌమ అధికారాన్ని తప్పు పట్టే విధంగా వ్యవహరించకూడదు. కానీ మనదేశంలో ఉంటూనే బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ ఇవన్నీ చేసింది. గత ప్రభుత్వాలు బీబీసీ ని చూసి జడుసుకునేవి. అది ఎలాంటి ప్రసారాలు చేసినా నిశ్శబ్దంగా ఉండేవి. కానీ మోడీ ప్రభుత్వం అలా కాదు కదా.. బీబీసీ అసలు రూపాన్ని బయటపెట్టాడు. ఒక్క తొక్కుడు తొక్కితే బీబీ సీకి తత్వం బోధపడింది.
రూపం మార్చుకుంది
ఇన్నాళ్లపాటు మనదేశంలో ఉంటూ మన దేశం మీద విషం చెప్పిన బీబీసీ.. ఇప్పుడు రూపం మార్చుకుంది. తన సంస్థలో పనిచేసిన నలుగురు మాజీ ఉద్యోగులతో “కలెక్టివ్ న్యూస్ రూమ్” పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేయనుంది. దీని పేరుతోనే వార్తలను ప్రసారం చేయనుంది. పేరు మారినంత మాత్రాన బీబీసీ అసలు రూపం మారుతుందనుకోవడం భ్రమే. ఎందుకంటే దాని మూలం బ్రిటన్ లో ఉంది. అక్కడి నుంచే దానికి నిధులు వస్తుంటాయి. అమెరికా నుంచి కూడా ఆర్థిక సహాయం అందుతుంది. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా బీబీసీ బ్రిటన్, అమెరికా ఎజెండాను అమెరికా ఎజెండాకు అనుకూలంగా వార్తలు ప్రసారం చేస్తుంది. కొత్తగా పేరు మార్చుకున్నప్పటికీ బీబీసీ బుద్ధి మారదు. ఎందుకంటే కుక్క తోక ఎప్పుడూ వంకరే. ఈ కలెక్టివ్ న్యూస్ సంస్థలో ఉన్న నలుగురు బీబీసీ మాజీ ఉద్యోగులు భారతీయులే. వారంతా ఒకప్పుడు ఆ సంస్థలో పనిచేసినవారే. పైగా భారత్ మీద వ్యతిరేక వార్తలు రాసినవారే.
నిబంధనలు పాటించాల్సిందే
కేవలం భారతీయ ఉద్యోగులను నియమించుకోవడం ద్వారా.. వారి పేరుతో సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా.. బీబీసీ కి స్వేచ్ఛ లభిస్తుంది. తన ఎజెండాను అమలు చేయడానికి సాధ్యమవుతుంది. ఒకవేళ కలెక్టివ్ న్యూస్ రూమ్ కూడా అడ్డగోలుగా, నిరాధారమైన వార్తలు ప్రసారం చేస్తే.. అప్పుడు కేంద్రం తీసుకునే చర్యలు వేరే విధంగా ఉంటాయి.