https://oktelugu.com/

Balayya: కృష్ణవంశీ చెప్పిన స్టోరీని బాలయ్య ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా…?

స్టార్ హీరోల్లో నాగార్జున ను మినహాయిస్తే ఆయన మరే స్టార్ హీరోతో కూడా సినిమా చేయలేదు. ఇక ఇప్పుడున్న స్టార్ హీరోల్లో ఎన్టీయార్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్ లతో సినిమాలు చేశారు.

Written By:
  • Gopi
  • , Updated On : April 8, 2024 / 11:47 AM IST

    why Balakrishna rejected the story told by Krishna vamsi

    Follow us on

    Balayya: అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది దర్శకులు ఉన్నప్పటికీ కృష్ణవంశీకి ఉన్న క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి. ఆయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు సైతం పోటీపడుతూ ఉండేవారు. ఎందుకంటే ఆయన సినిమాల్లో చేస్తే హీరోలకు ప్రత్యేకమైన ఇమేజ్ వస్తుందని భావించేవారు. అందుకే ఆయనతో సినిమా అంటే హీరోలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే వారు. అందులో భాగంగానే ఆయన ఎక్కువగా స్టార్ హీరోలతో సినిమాలు చేయలేకపోయాడు.

    అప్పటి స్టార్ హీరోల్లో నాగార్జున ను మినహాయిస్తే ఆయన మరే స్టార్ హీరోతో కూడా సినిమా చేయలేదు. ఇక ఇప్పుడున్న స్టార్ హీరోల్లో ఎన్టీయార్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్ లతో సినిమాలు చేశారు. అయితే బాలయ్య బాబుతో ఒక సినిమా చేయాలని కృష్ణవంశీ చాలా ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఆ సినిమా మాత్రం వర్కౌట్ అవ్వలేదు. అయితే కృష్ణవంశీ జగపతి బాబుతో చేసిన సముద్రం సినిమా స్టోరీ ని మొదట బాలయ్య బాబుకి చెప్పారట. కానీ బాలయ్య కి ఆ స్టోరీ అంత పెద్దగా నచ్చకపోవడంతో దాన్ని రిజెక్ట్ చేశాడట… ఇక మొత్తానికైతే కృష్ణవంశీ ఈ సినిమాని జగపతిబాబుతో చేసి ఒక భారీ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

    ఇక ఈయన చేసిన సినిమాల్లోనే ఈ సినిమా అతి పెద్ద డిజాస్టర్ అనే చెప్పాలి. అయితే ఈ సినిమా లో నటించినందుకు గాను జగపతిబాబుకి నటుడిగా మంచి గుర్తింపు అయితే వచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఆ తర్వాత కూడా బాలయ్య బాబుతో సినిమా చేయడానికి కృష్ణవంశీ చాలా వరకు ప్రయత్నం చేశాడు. కానీ వీళ్ళిద్దరి కాంబినేషన్ కి సెట్ అయ్యే కథ దొరక్కపోవడంతో కృష్ణవంశీ బాలయ్య తో సినిమా చేయలేకపోయాడు. ఇక రీసెంట్ గా కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది అనే వార్తలైతే వచ్చాయి.

    కానీ అవి ఏవి కూడా కార్యరూపం దాల్చలేదు. ఇంకా కృష్ణవంశీ రామ్ చరణ్ తో చేసిన ‘గోవిందుడు అందరివాడేలే ‘ సినిమా మాత్రమే ఆయన చివరిసారిగా పెద్ద హీరోలతో చేసిన సినిమా కావడం విశేషం…ఇక ఆ తర్వాత ఆయన మరే స్టార్ హీరోతో కూడా సినిమాలు చేయలేకపోయాడు… నిజానికి కృష్ణవంశీ బాలయ్య ల కాంబినేషన్ లో సినిమా వస్తే మాత్రం అది సూపర్ హిట్ అయ్యేదని చాలామంది బాలయ్య అభిమానులు ఇప్పటికీ అభిప్రాయపడుతుంటారు…