https://oktelugu.com/

Pushpa 2 : ది రూల్’ టికెట్ రేట్స్..ఈరోజు నుండి కలెక్షన్స్ లో అనూహ్యమైన మార్పు ఉండనుందా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకో అద్భుతం సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : December 9, 2024 / 02:19 PM IST

    Pushpa 2

    Follow us on

    Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకో అద్భుతం సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కేవలం ఈ ఊపు వీకెండ్ వరకే పరిమితం, సోమవారం నుండి వసూళ్లు బాగా తగ్గిపోతాయని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ సినిమా సోమవారం రోజు కూడా నూన్ షోస్ నుండే అద్భుతమైన ఆక్యుపెన్సీలను నమోదు చేసుకుంది. కారణం తగ్గిన టికెట్ రేట్స్ అని విశ్లేషకులు అంటున్నారు. మొదటి నాలుగు రోజులు వీకెండ్ అవ్వడంతో టికెట్ రేట్స్ నిర్మాతలు భారీ రేట్ పెట్టారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలలో ఈ సినిమాని మల్టీ ప్లెక్స్ లో చూడాలంటే కచ్చితంగా 500 రూపాయిలు ఒక టికెట్ కి చెల్లించాలి. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి వీకెండ్ లో కదిలేందుకు కాస్త తడబడ్డారు. టికెట్ రేట్స్ తగ్గినప్పుడు థియేటర్స్ లో చూసుకోవచ్చు అనే ధోరణిని ప్రదర్శించారు.

    ఈ ట్రెండ్ ని ముందుగానే పసిగట్టిన మేకర్స్, సినిమాకి లాంగ్ రన్ రావాలి అనే ఉద్దేశ్యంతో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ లో వీకెండ్ వరకు మల్టీ ప్లెక్స్ లో 500 రూపాయిలు, సింగిల్ స్క్రీన్స్ లో 350 రూపాయలకు టికెట్స్ ని విక్రయించారు. కానీ నేటి నుండి మాత్రం మల్టీ ప్లెక్స్ థియేటర్స్ లో టికెట్ రేట్ ని 500 నుండి 350 రూపాయలకు, అదే విధంగా సింగల్ స్క్రీన్స్ 350 నుండి 200 రూపాయలకు తగ్గించారు. దీంతో టికెట్స్ కొనేవాళ్ళ సంఖ్య ఘననీయంగా పెరిగింది. ఒక్కసారి హైదరాబాద్ బుక్ మై షో స్టేటస్ ఓపెన్ చేసి చూస్తే మీ దిమ్మ తిరిగిపోతాది. సెలవు దినంలో ఎలాంటి ట్రెండ్ కనిపిస్తుందో, అలాంటి ట్రెండ్ నేడు కనిపిస్తుంది. కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాదు, తెలంగాణ జిల్లాల్లో కూడా టికెట్ రేట్ తగ్గడం వల్ల వసూళ్లు భారీగా పెరిగాయి.

    ఆంధ్ర ప్రదేశ్ లో కూడా టికెట్ రేట్స్ బాగా తగ్గాయి. ఫలితంగా వైజాగ్, నెల్లూరు, సీడెడ్, ఇలా ప్రధాన ప్రాంతాల్లో ఈ సినిమా వసూళ్లు నేడు అదిరిపోయాయి. ఇదే విధంగా కొనసాగితే మాత్రం ‘పుష్ప 2 ‘ చిత్రం ఈ వీకెండ్ తోనే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకోబోతుందని అంటున్నారు. ఇది ఇలా ఉండగా బుక్ మై షో లో కూడా టికెట్ అమ్మకాలు ప్రతీ గంటకు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. కల్కి చిత్రానికి మొదటి సోమవారం 32 వేలకు పైగా టిక్కెట్లు మొదటి రోజు అమ్ముడుపోగా, ‘పుష్ప 2’ చిత్రానికి ఏకంగా 63 వేల టిక్కెట్లు ఒక గంటకు అమ్ముడుపోతున్నాయి. ఇది సాధారణమైన విషయం కాదు, ఊపు చూస్తుంటే నేడు కూడా ఈ చిత్రానికి వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చేలా ఉన్నాయని ట్రేడ్ పండితులు అంటున్నారు.