https://oktelugu.com/

Mahesh Babu : ఒకప్పుడు చిరంజీవి చేసిన సినిమా స్టోరీ లతో మహేష్ బాబు సినిమా చేయాలనుకున్నాడా..?ఇంతకీ ఆ సినిమాలేంటి..?

సినిమా ఇండస్ట్రీ చాలామంది నటులు వాళ్లకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడానికి కృషి చేస్తుంటారు. ముఖ్యంగా స్టార్ హీరో అవ్వాలి అంటే మాత్రం మాస్ సినిమాలను చేసి మంచి గుర్తింపును సంపాదించుకోవాలి.

Written By:
  • Gopi
  • , Updated On : December 9, 2024 / 02:05 PM IST

    Mahesh Babu

    Follow us on

    Mahesh Babu : సినిమా ఇండస్ట్రీ చాలామంది నటులు వాళ్లకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడానికి కృషి చేస్తుంటారు. ముఖ్యంగా స్టార్ హీరో అవ్వాలి అంటే మాత్రం మాస్ సినిమాలను చేసి మంచి గుర్తింపును సంపాదించుకోవాలి. బీ,సీ సెంటర్లో క్రేజ్ సంపాదించుకున్న ఒకవేళ ఆ హీరోల సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఆ మూవీస్ కి రీజనబుల్ కలెక్షన్స్ అయితే వస్తాయి. అందుకోసమే ప్రతి ఒక్క హీరో కూడా మాస్ హీరోగా ఎదగాలనే సంకల్పాన్ని పెట్టుకొని ముందుకు సాగుతున్నారు…

    సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు…ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకోడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సంపాదించి పెట్టుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇక ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఆయన రాజమౌళితో కలిసి పాన్ వరల్డ్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తుందనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవడంలో రాజమౌళి సిద్ధహస్తుడనే చెప్పాలి. మరి ఆయన ఈసారి మహేష్ బాబును ఏ రేంజ్ లో చూపించబోతున్నాడనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబుకి చిరంజీవి అంటే అమితమైన ఇష్టం ఉందనే విషయం మనకు తెలిసిందే. ఇక సూపర్ స్టార్ కృష్ణ తర్వాత చిరంజీవి నటన అంటే తనకు చాలా ఇష్టమని చాలా సందర్భాల్లో తెలియజేశారు. మరి మొత్తానికైతే ఆయనకి ఒకప్పుడు చిరంజీవి చేసిన సినిమాల్లో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘ గ్యాంగ్ లీడర్’ సినిమాలంటే చాలా ఇష్టమని చెబుతూ ఉంటాడు.

    మరి ఈ క్రమంలోనే అలాంటి సినిమాలను తను కూడా చేయాలని అనుకున్నప్పటికి అలాంటి కథలు తన దగ్గరికి రాలేదని ఈ జనరేషన్ కి తగ్గట్టుగా ఆ కథలను మలచగలిగితే ఏ దర్శకుడితో అయిన సరే సినిమా చేస్తానని పోకిరి సినిమా సమయంలో అనుకున్నారట.

    కానీ అలాంటి కథలు ఆయనకు తారసపడలేదని తద్వారా ఆ సినిమాలను వదిలేయాల్సి వచ్చిందని ఆయన చెప్పడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న మహేష్ బాబు పాన్ వరల్డ్ లో మంచి గుర్తింపును సంపాదించుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలతో సూపర్ సక్సెస్ ను సాధిస్తే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న వాడు అవుతాడు.

    లేకపోతే మాత్రం సినిమా ఇండస్ట్రీలో భారీగా వెనుకబడిపోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికి తన తోటి హీరోలందరూ పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధిస్తుంటే ఇప్పటివరకు ఆయన ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయకపోవడం విశేషం…