Pushpa 2 Sooseki Song: పుష్ప సక్సెస్ లో దేవిశ్రీ(DSP)మ్యూజిక్ పాత్ర ఎంతగానో ఉంది. పాటలతో పాటు ఆయన అందించిన బీజీఎం సినిమాకు ఆయువుపట్టులా నిలిచింది. ఇక శ్రీవల్లి, సామి సామి, ఊ అంటావా మామా… సాంగ్స్ మాస్ ఆడియన్స్ ని పిచ్చపిచ్చగా ఎంటర్టైన్ చేశాయి. సామి సామి సాంగ్ లో అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక మందాన(Rashmika Mandanna) స్టెప్స్ అలరిస్తాయి. సామి సామి తరహాలోనే నేడు విడుదలైన ‘సూసేకి’ సాంగ్ ఉంది. అయితే సామి సామి సాంగ్ లో ఉన్నంత మాస్ ఫ్లేవర్ సూసేకి సాంగ్ లో లేదు.
అందుకు కారణం సింగర్ శ్రేయా ఘోషల్(Shreya Ghoshal). మెలోడీస్ కి శ్రేయా ఘోషల్ పెట్టింది పేరు. ఆమె వాయిస్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. శ్రేయా ఘోషల్ మాస్ సాంగ్స్ పాడింది తక్కువ. సామి సామి సాంగ్ ని మౌనిక యాదవ్ పాడింది. ఆమె వాయిస్ చక్కగా సెట్ అయ్యింది. సూసేకి సాంగ్ ని మౌనిక యాదవ్ తో పాటిస్తే సామి సామి సాంగ్ గుర్తుకు వస్తుందని దేవిశ్రీ భావించాడేమో కానీ శ్రేయా ఘోషల్ ని ఎంచుకున్నాడు. అది మైనస్ అయ్యింది.
Also Read: Fahad Fazil : పుష్ప విలన్ కి ఆ వ్యాధి సోకిందా… స్వయంగా చెప్పి షాక్ ఇచ్చిన ఫహాద్ ఫాజిల్!
పుష్ప 2 నుండి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘పుష్ప పుష్ప’ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. సూసేకి సాంగ్ ఆ రేంజ్ లో ఆదరణ పొందే సూచనలు కనిపించడం లేదు. మరి చూడాలి నెటిజెన్స్ ఈ సాంగ్ పట్ల ఎలా స్పందిస్తారో. చంద్రబోస్ సాహిత్యం అందించగా గణేష్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు.
Also Read: Box Office Fight: చిన్న హీరోల బాక్సాఫీస్ ఫైట్… ఆ ముగ్గురిలో విన్నర్ ఎవరు?
పుష్ప 2 ఆగస్టు 15న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. దర్శకుడు సుకుమార్ ప్రతిష్టాత్మకంగా పుష్ప 2 తెరకెక్కిస్తున్నారు. పుష్ప 2 బడ్జెట్ దాదాపు రూ. 300 కోట్లు అని సమాచారం. పుష్ప 2 రూ. 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పుష్ప 2 చిత్రంలో ప్రధాన విలన్ గా మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. సునీల్, అనసూయ, రావు రమేష్, జగదీశ్ కీలక రోల్స్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.