Banyan Tree Fruits: అందమైన మర్రి చెట్టు దానికి యాపిల్ పండ్లు.. ఈ వింత ఎక్కడంటే?

కెసి కెనాల్ దగ్గర 500 సంవత్సరాలకు చెందిన ఓ ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది . ఈ మరి చెట్టు కేవలం నీడకే కాకుండా పక్షులు జంతువులకు అన్నింటికీ ఆహారాన్ని అందిస్తుంది.

Written By: Swathi, Updated On : May 29, 2024 12:34 pm

Banyan Tree Fruits

Follow us on

Banyan Tree Fruits: అందమైన మర్రి చెట్టు ఆ చెట్టుకు యాపిపండ్లు. ఏంటి మర్రిచెట్టుకు యాపిల్ పండ్లా అని పండ్లు ఓపెన్ చేశారా? కానీ యాపిల్ లాంటి పండ్లు.. చూడటానికి చూడముచ్చటగా అనిపించే ఆ చెట్టు విశాలమైన ఊడలు, పెద్ద పెద్ద కొమ్మలు ఊరు విశాలతను తెలిపేలా చెట్టు కొమ్మలు చూస్తుంటే ఎంత అందంగా ఉంటుంది. మరి ఈ చెట్టు ఎక్కడ ఉందంటే.. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో జూపాడు బంగ్లా మండలంలో తరిగోపుల గ్రామంలో ఉంటుంది ఈ మర్రి చెట్టు.

కెసి కెనాల్ దగ్గర 500 సంవత్సరాలకు చెందిన ఓ ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది . ఈ మరి చెట్టు కేవలం నీడకే కాకుండా పక్షులు జంతువులకు అన్నింటికీ ఆహారాన్ని అందిస్తుంది. ఎండ తీవ్రతను భరించలేక ప్రజలు, జంతువులు, పక్షులు అక్కడికి వస్తుంటారు.

ఎక్కడైనా పండ్ల చెట్ల మీద వాలి పండ్లు, కూరగాయాలు తిందాం అంటే యజమానులు ఊరుకుంటారా? ఇక అడవిలోకి వెళ్దా అంటే చెట్లు ఉన్నాయా? అందుకే ఇలా ఊరికి కొన్ని చెట్లు ఉంటే పక్షులకు ఎంత బాగుంటుంది కదా. ఈ యాపిల్ పండ్ల లాంటి పండ్లను కలిగి ఉన్న మర్చి చెట్టు అన్ని గ్రామాల్లో ఉంటే ఎంత బాగుంటుంది కదా.

ఈ మర్రి చెట్టును పెద్దపెద్ద కొమ్మలతో చుట్టుపక్కల ప్రాంతాన్ని మొత్తం ఆక్రమించుకొని ఒక పెద్ద వృక్షంగా ఎదిగింది. ఈ చెట్టుకు మనం యాపిల్ పండ్లను చూసిన మాదిరిగానే ఈ చెట్టుకు చిన్నచిన్న ఎర్రటి పండ్లు ఉంటాయి. ఈ పండ్లను తినడానికి .. కొంగలు., అడవి బాతులు, పావురాలు, ఉడతలు.. వంటవి వచ్చి ఈ మర్రి చెట్టు పైనే ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాయట. మీ గ్రామంలో ఇలాంటి చెట్లు ఉంటే నరికివేయకుండా వాటిని కాపాడండి.