Box Office Fight: ఒక పక్క ఎలక్షన్స్ మరో పక్క ఐపీఎల్. దాంతో బడా చిత్రాలు 2024 సమ్మర్ సీజన్ వదిలేశాయి. నిజానికి మే 9న కల్కి 2829 AD(Kalki 2829AD) విడుదల కావాల్సింది. అది వాయిదా పడింది. స్టార్ హీరోల చిత్రాలు లేకపోవడంతో చిన్న హీరోలు పండగ చేసుకుంటున్నారు. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ సినిమాతో విజయ్ దేవరకొండ ప్రేక్షకులను పలకరించారు. ఫ్యామిలీ స్టార్ తర్వాత స్టార్ హీరోల చిత్రాలు విడుదలయ్యిందే లేదు.
మే 31న ముగ్గురు చిన్న హీరోలు బాక్సాఫీస్ వద్ద ఫైట్ కి సిద్ధం అవుతున్నారు. పెద్దగా పోటీ లేని క్రమంలో హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాకు వసూళ్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ఇంకా స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ కాలేదు. కాబట్టి పాజిటివ్ టాక్ వస్తే పండగే అని చెప్పాలి. మరి ఈ శుక్రవారం విడుదలవుతున్న చిత్రాల వివరాలు చూస్తే… విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంతో సమ్మర్ బరిలో దిగారు.
Also Read: Star Heroine: వరుస హిట్స్ తో సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs of Godavari) చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకుడు. నేహా శెట్టి, అంజలి హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రంలో విశ్వక్ సేన్ మాస్ రోల్ చేశారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలకృష్ణ గెస్ట్ గా వచ్చాడు. కాబట్టి మంచి ప్రచారం దక్కింది. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ నటించిన మూవీ భజే వాయువేగం(Bhaje Vaayu Vegam). ఈ చిత్రం టైటిల్ విపరీతంగా ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ తో ఓజీ చిత్రం చేస్తున్న దర్శకుడు సుజీత్ ఈ చిత్రానికి ప్రచారం కల్పించారు.
Also Read: Sujeeth: సుజీత్ పవన్ కళ్యాణ్ తో రీమేక్ సినిమా చేయాలి కానీ ఓజీ సినిమా ఎలా చేశాడంటే..?
కార్తికేయతో పాటు దర్శకుడిని సుజీత్ ఇంటర్వ్యూ చేయడంతో భజే వాయువేగం చిత్రానికి ప్లస్ అయ్యింది. మే 31న విడుదల అవుతున్న మూడో చిత్రం గం గం గణేశా(Gam Gam Ganesha). విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించాడు. బేబీ వంటి బ్లాక్ బస్టర్ అనంతరం ఆనంద్ దేవరకొండ నుండి వస్తున్న చిత్రం ఇది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రష్మిక మందాన గెస్ట్ గా రావడం కలిసొచ్చింది. మూడు చిత్రాల మీద బజ్ ఉంది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మూవీ లాభాలు పంచడం ఖాయం. మరి విన్నర్ ఎవరు అవుతారో చూడాలి..