Pushpa 2 and Lucky Bhaskar : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) నటించిన ‘పుష్ప 2 : ది రూల్'(Pushpa 2 : The Rule) ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మీ అందరికీ తెలుసు. ఒక కమర్షియల్ సినిమాతో 1800 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టడం అనేది సాధారణమైన విషయం కాదు. అల్లు అర్జున్ మ్యాజిక్ ఆ రేంజ్ లో పని చేసింది మరి. అయితే థియేటర్స్ వద్ద ఆ రేంజ్ సునామీ ని నెలకొల్పిన ఈ చిత్రం, ఓటీటీ లో మాత్రం అనుకున్న స్థాయి రెస్పాన్స్ ని అందుకోలేదా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో జనవరి 30 వ తారీఖున తెలుగు తో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల చేసారు. ప్రారంభంలో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. దాదాపుగా 18 మిల్లియన్లకు పైగా ఇప్పటి వరకు వ్యూస్ వచ్చినట్టు సమాచారం.
Also Read : భారీ లాభాలతో బ్లాక్ బస్టర్ అయిన పుష్ప-2 మూవీ.. అయినా ఆయనకు భారీ నష్టాలు ?
కానీ ఈ చిత్రం ‘లక్కీ భాస్కర్'(Lucky Bhaskar) రేంజ్ లో ఓటీటీ ఆడియన్స్ లో బలమైన ఇంప్యాక్ట్ క్రియేట్ చేయలేదని లేటెస్ట్ గా వినిపిస్తున్న వాదన. ‘లక్కీ భాస్కర్’ చిత్రం గత ఏడాది నవంబర్ 28 న తెలుగు తో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ సినిమా టాప్ 10 లో మిస్ కాకుండా ట్రెండ్ అవుతూనే ఉంది. ఏమద్యలో ఎన్నో సినిమాలు నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చాయి. అందులో ‘పుష్ప 2’, ‘డాకు మహారాజ్'(Daaku Maharaj) వంటి చిత్రాలు కూడా ఉన్నాయి. రీసెంట్ గానే తమిళ స్టార్ హీరో అజిత్ ‘విడాముయార్చి’ కూడా నెట్ ఫ్లిక్స్(Netflix) లోకి వచ్చింది. వీటితో పాటు ఎన్నో హాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలు, బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలు కూడా వచ్చాయి. కానీ ‘లక్కీ భాస్కర్’ రేంజ్ చెక్కు చెదరలేదు. ఇప్పటికీ టాప్ 10 లో ట్రెండ్ అవుతూనే ఉంది. అంటే దాదాపుగా 13 వారాల నుండి ట్రెండింగ్ అన్నమాట.
13 వారాల క్రితం విడుదలైన ‘లక్కీ భాస్కర్’ చిత్రం ఇంకా టాప్ 10 లో ఉంది, కానీ నాలుగు వారల క్రితం విడుదలైన ‘పుష్ప 2’ మాత్రం 7వ స్థానానికి పడిపోయింది. అంటే ‘లక్కీ భాస్కర్’ చిత్రనికంటే ‘పుష్ప 2’ కి తక్కువ రెస్పాన్స్ వచ్చినట్టే అనుకోవచ్చు. ఇంకో రెండు కొత్త సినిమాలు వస్తే పుష్ప 2 అయినా ట్రెండింగ్ నుండి వెళ్లిపోవచ్చేమో కానీ, ‘లక్కీ భాస్కర్’ మాత్రం టాప్ 10 నుండి కదిలే అవకాశాలే కనిపించడం లేదు. నెట్ ఫ్లిక్స్ లో వచినటువంటి ఈ సెన్సేషనల్ రెస్పాన్స్ ని చూసి, ఇది చాలా పొటెన్షియల్ ఉన్న సినిమా , బాక్స్ ఆఫీస్ వద్ద సరైన టైం లో విడుదల అయ్యుంటే 400 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టేదని, ఇప్పుడు కేవలం 120 కోట్ల గ్రాస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు.