Lucky Bhaskar
Lucky Bhaskar : గత ఏడాది సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన చిత్రాలలో ఒకటి దుల్కర్ సల్మాన్(Dulquer Salman) హీరో గా నటించిన ‘లక్కీ భాస్కర్'(Lucky Bhaskar) చిత్రం. ‘సీతారామం’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత దుల్కర్ తెలుగు లో చేసిన చిత్రమిది. ‘సార్’ వంటి సూపర్ హిట్ తో మంచి ఊపు మీదున్న వెంకీ అట్లూరి(Venky Atluri) ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సార్ కి మించి మూడింతలు పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో సూపర్ హిట్ గా నిలిచినప్పటికీ ఈ సినిమాని అభిమానించే వారిలో ఒక చిన్న అసంతృప్తి మిగిలింది. ఎందుకంటే థియేటర్స్ లో ఈ చిత్రానికి కనీసం 400 కోట్ల రూపాయిల గ్రాస్ రాబట్టేంత సత్తా ఉందని, కానీ కేవలం 120 కోట్ల రూపాయిల గ్రాస్ వద్ద ఆగిపోయిందని కొంతమంది బాధపడుతూ ఉంటారు. అలా పెద్ద రేంజ్ కి వెళ్లకపోవడానికి కారణం ‘అమరన్’.
అమరన్, క, లక్కీ భాస్కర్..ఈ మూడు చిత్రాలు ఒకే రోజు విడుదలయ్యాయి, మూడింటికి సూపర్ హిట్ టాక్ వచ్చింది. కానీ అమరన్ చిత్రానికి 350 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, లక్కీ భాస్కర్ కి కేవలం 120 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా తమిళనాడు లో అమరన్ ప్రభావం చాలా గట్టిగా పడింది. కానీ రెండు మూడు వారల తర్వాత తమిళ వెర్షన్ ని తమిళనాడు లో విడుదల చేయగా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా ఓటీటీ లో విడుదలయ్యాక సెన్సేషనల్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. ట్రేడ్ పండితులను సైతం నివ్వెరపోయేలా చేసింది. నవంబర్ 28 న విడుదలైన ఈ సినిమా, ఇప్పటి వరకు, అనగా 13 వారాల పాటు నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10 ట్రెండ్ అయ్యింది, ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది.
‘దేవర’, ‘కల్కి’, ‘సలార్’ లాంటి పాన్ ఇండియన్ సినిమాలను కూడా డామినేట్ చేసి సంచలనం సృష్టించింది. ఇంకొక్క వారం ట్రెండ్ అయితే #RRR రికార్డు కూడా అవుట్. ఈ 13 వారాలకు కలిపి 40 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయట. ఇది ఆల్ టైం సెన్సేషనల్ రికార్డు అని అంటున్నారు. ఈ మూడు నెలల గ్యాప్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నెట్ ఫ్లిక్స్ లో వచ్చాయి. హాలీవుడ్ అయితే లెక్కే లేదు. ‘దేవర’, ‘పుష్ప 2’ వంటి చిత్రాలు కూడా వచ్చాయి. అయినప్పటికీ టాప్ 10 లో ట్రెండ్ అవుతుందంటే ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా దెబ్బకి రాబోయే దుల్కర్ సినిమాలకు ఓటీటీ లో విపరితమైన డిమాండ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాలకు జరిగినట్టు ఫ్యాన్సీ బిజినెస్ దుల్కర్ సల్మాన్ కి జరిగే అవకాశాలు ఉన్నాయి, చూడాలి మరి ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది.