Nandamuri Kalyan Ram , Vijayashanti
Nandamuri Kalyan Ram : నందమూరి కుటుంబం లో విభిన్నమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న నటుడు నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram). హరికృష్ణ పెద్ద తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ రామ్ కి ప్రారంభం లో పరాజయాలే ఎక్కువగా పలకరించాయి. కానీ ‘అతనొక్కడే’ సినిమాతో ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యే బ్లాక్ బస్టర్ ని అందుకొని సురేందర్ రెడ్డి ని మన టాలీవుడ్ కి పరిచయం చేసాడు. అలా కేవలం సురేందర్ రెడ్డి ని మాత్రమే కాదు, పటాస్ సినిమాతో అనిల్ రావిపూడి ని, ‘బింభిసార’ తో వశిష్ఠ ని ఇలా ఎంతో మందిని ఇండస్ట్రీ కి పరిచయం చేసిన ఘనత కళ్యాణ్ రామ్ సొంతం. ఇప్పుడు ఆయన ప్రదీప్ చిలుకూరి అనే మరో టాలెంటెడ్ డైరెక్టర్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేయబోతున్నాడు. ఈయన కూడా భవిష్యత్తులో పెద్ద రేంజ్ కి వెళ్లే అవకాశాలు ఉంటాయట.
పూర్తి వివరాల్లోకి వెళ్తే కళ్యాణ్ రామ్ హీరో గా, సాయి మంజ్రేకర్(Sai Manjrekar) హీరోయిన్, సీనియర్ నటి, లేడీ అమితాబ్ గా పిలవబడే విజయశాంతి(Vijay Shanthi) ప్రధాన పాత్రలో ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న చిత్రానికి ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'(Arjun S/O Vyjayanthi) అనే టైటిల్ ని ఖరారు చేసారు. విజయశాంతి ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ లో కనిపించబోతుంది. కళ్యాణ్ రామ్ ఆమె కొడుకుగా కనిపించబోతున్నాడు. మొదట్లో ఈ చిత్రానికి రుద్రా అనే టైటిల్ ని పెడతారని అందరూ అనుకున్నారు కానీ, అందులో ఎలాంటి నిజం లేదని తెలిసింది. ఈ చిత్రం చాలా అద్భుతంగా వచ్చిందట. నందమూరి అభిమానులు గర్వం తో మీసం మెలేసే రేంజ్ లో ఈ సినిమా నిలుస్తుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ టీజర్ ని విడుదల చేయబోతున్నట్టు సమాచారం.
Also Read : వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్… కళ్యాణ్ రామ్ కెరీర్ మళ్ళీ మొదటికి!
ఈ చిత్రం కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందట. వింటేజ్ విజయశాంతి ఎలా ఉంటుందో మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఆమె హీరోలతో సమానంగా ఫైట్స్ కూడా చేసేది. ఈ చిత్రం లో అలాంటి వింటేజ్ అవతారం లో విజయశాంతి ని చూపించబోతున్నారట. ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి, ఆ సినిమా సూపర్ హిట్ అయ్యాక మళ్ళీ సినిమాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని, ఇది కేవలం మహేష్ బాబు కోసమే చేసానని, నా శేష జీవితం రాజకీయాలకు మాత్రమే అంకితం అని చెప్పింది. కానీ ఇప్పుడు మళ్ళీ కళ్యాణ్ రామ్ సినిమాలో నటించడానికి ఒప్పుకుందంటే స్టోరీ ఎంత పవర్ ఫుల్ గా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. ‘బింభిసార’ చిత్రం తో చరిత్ర సృష్టించిన కళ్యాణ్ రామ్, ఆ తర్వాత ‘అమిగోస్’, ‘డెవిల్’ వంటి వరుస ఫ్లాప్స్ ని అందుకున్నాడు. ఇప్పుడు ఈ చిత్రంతో మళ్ళీ భారీ కం బ్యాక్ ఇచ్చి తన సత్తా చాటాలని అనుకుంటున్నాడు కళ్యాణ్ రామ్.
Also Read : ఫస్ట్ టైం భార్య గురించి సంచలన విషయాలు బయటపెట్టిన కళ్యాణ్ రామ్… నన్ను అలా చూసిందంటూ!