https://oktelugu.com/

Pushpa 2 OTT: ఓటీటీలో పుష్ప 2, అధికారిక ప్రకటన చేసిన డిజిటల్ దిగ్గజం, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. పుష్ప 2 కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఫస్ట్ షో నుండే సినిమా అద్భుతం అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వెల్లువెత్తాయి. ప్రముఖ రివ్యూవర్స్ టాప్ రేటింగ్ ఇచ్చారు. పుష్ప 2 బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు ఫిక్స్ అయ్యాయి.

Written By:
  • S Reddy
  • , Updated On : December 5, 2024 / 01:23 PM IST

    Pushpa 2 OTT

    Follow us on

    Pushpa 2 OTT: కాగా పుష్ప 2 ఓటీటీ విడుదలపై అధికారిక సమాచారం అందుతుంది. పుష్ప 2 డిజిటల్ రైట్స్ చాలా కాలం క్రితమే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్.. నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ పుష్ప పార్ట్ 1 ని దక్కించుకుంది. సీక్వెల్ కోసం ప్రైమ్ చాలా ట్రై చేసింది. నెట్ఫ్లిక్స్ రికార్డు ధరకు పుష్ప 2 చిత్రాన్ని సొంతం చేసుకుంది. అన్ని భాషల డిజిటల్ రైట్స్ కొరకు రూ. 275 కోట్లు చెల్లించారని సమాచారం. ఈ మొత్తం దాదాపు పుష్ప 2 బడ్జెట్ లో సగానికంటే ఎక్కువ. ఆర్ ఆర్ ఆర్ మూవీ డిజిటల్ రైట్స్ అత్యధికంగా రూ. 170 కోట్లు పలికాయని సమాచారం. అంతకు వంద కోట్లు అధికంగా పుష్ప 2 చిత్రానికి చెల్లించారు.

    పుష్ప 2 విడుదలకు ముందే నిర్మాతలకు లాభాలు పంచింది. రూ. 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. పుష్ప 2 లాభాల్లో వాటాను పారితోషికంగా మాట్లాడుకున్న అల్లు అర్జున్ రూ. 300 కోట్లు పొందారనేది టాలీవుడ్ టాక్. ఇక పుష్ప 2 డే వన్ ఓపెనింగ్ కలెక్షన్స్ రూ. 250 నుండి 300 కోట్లు ఉంటాయని అంచనా. టికెట్స్ ధరలు, సోలో రిలీజ్, అదనపు షోలు… పుష్ప 2 చిత్రానికి కలిసి రానున్నాయి.

    ఇక పుష్ప 2 ఓటీటీ విడుదల జనవరిలో ఉంటుందట. థియేటర్స్ లోకి వచ్చిన 50 రోజల అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ చేయాలనేది ఒప్పంద అట ఆ లెక్కన 2025 జనవరి నాలుగోవారంలో పుష్ప 2 ఓటీటీలో అందుబాటులోకి రానుంది. కాబట్టి పుష్ప 2 చిత్రాన్ని ఓటీటీలో చూడాలని అనుకునేవాళ్లు దాదాపు నెల రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది.

    పుష్ప 2 కథ విషయానికి వస్తే… ఎర్రచందనం చెట్లు నరికే కూలీ అయిన.. పుష్పరాజ్ మాఫియా సిండికేట్ కి లీడర్ అవుతాడు. ఆ తర్వాత తన స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని అంతర్జాతీయ స్థాయికి చేర్చుతాడు. పుష్ప రాజ్ పై పగ తీర్చుకోవాలని షెకావత్ ప్రయత్నం చేస్తుంటాడు. వారిద్దరి మధ్య సంఘర్షణ ఎలా ఉంది? సీఎం ని కూడా శాసించే స్థాయికి వెళ్లిన పుష్పరాజ్ కి ఎదురైన సవాళ్లు ఏంటనేది సిల్వర్ స్క్రీన్ పై చూడాలి..