https://oktelugu.com/

kitchen : ఈ 10 టూల్స్ మీ కిచెన్ లో మస్ట్.. అస్సలు మిస్ చేసుకోకండి

ఇంట్లో కొన్ని వస్తువులు కచ్చితంగా ఉండాలి. అప్పుడే దేనికి లోటు లేనట్టు అనిపిస్తుంది. ఇక అన్ని వస్తువులు లేకపోయినా సరే కానీ నిత్యం అవసరం అయ్యే వస్తువులు మాత్రం కచ్చితంగా ఉండాలి అనిపిస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : December 5, 2024 / 01:26 PM IST

    kitchen

    Follow us on

    kitchen : ఇంట్లో కొన్ని వస్తువులు కచ్చితంగా ఉండాలి. అప్పుడే దేనికి లోటు లేనట్టు అనిపిస్తుంది. ఇక అన్ని వస్తువులు లేకపోయినా సరే కానీ నిత్యం అవసరం అయ్యే వస్తువులు మాత్రం కచ్చితంగా ఉండాలి అనిపిస్తుంది. ఇక కిచెన్ లో కూడా అంతే కొన్ని వస్తువులు పక్కా కావాల్సిందే. లేదంటే వంట చేయడం కూడా కష్టమే. మరి మీ కిచెన్ కు కావాల్సిన మస్ట్ టూల్స్ ఏంటో ఓ సారి చూసేద్దామా?

    ఇన్‌స్టంట్ పాట్ లేదా ప్రెజర్ కుక్కర్ కచ్చితంగా వంటింట్లో ఉండాల్సిందే. ప్రెషర్ కుక్, స్లో కుక్, సాట్ మరిన్ని చేయగల మల్టీ-ఫంక్షనల్ కుక్కర్ వల్ల మీ వంట సులభం అవుతుంది. సో మర్చిపోవద్దు. కుక్కర్ లో ఒకసారి పప్పు వేస్తే ఐదు నిమిషాల్లో పప్పు రెడీ అవుతుంది. చికెన్, మటన్, అన్నం ఇలా ఏదైనా సరే ఈ ప్రెజర్ కుక్కర్ లో వండటం వల్ల సమయం చాలా సేఫ్ అవుతుంది. స్టాండ్ మిక్సర్ కూడా మీకు అవసరమయ్యే పరికరమే. పిండిని బాగా కలపడానికి, ఏదైనా మిక్సింగ్ చేసే పదార్థాలు ఉంటే వాటిని మిక్సింగ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.

    ఫుడ్ ప్రాసెసర్: చాకుతో కట్ చేయడం లేకుండా మంచి ముక్కలు చేస్తుంది ఈ పరికరం. ముక్కలు చేయడం మాత్రమే కాదు పూరీలు చేసే సామర్థ్యం ఉన్న గాడ్జెట్ కూడా. ఇమ్మర్షన్ బ్లెండర్ కూడా కొనుగోలు చేయవచ్చు. సూప్‌లు, సాస్‌లు ఇతర ద్రవాలకు సరైన హ్యాండ్‌హెల్డ్ బ్లెండర్ ఇది. ఎయిర్ ప్రేయర్ ను మీరు ఉపయోగిస్తున్నారా. ఇది వివిధ రకాల వంటలను వండడానికి తక్కువ నూనెను ఉపయోగించుతుంది. ఇది ఆహారాన్ని స్ఫుటంగా, ఉడికించడానికి వేగవంతమైన గాలి ప్రసరణ సాంకేతికతను ఉపయోగిస్తుంది. ఫలితంగా చాలా తక్కువ నూనెతో వేయించిన ఆకృతిని పొందుతుంది.

    సిలికాన్ గరిటెలను ఉపయోగించండి. వేడి-నిరోధకత, నాన్-స్టిక్ గరిటెలు కుండలు, ప్యాన్‌ల వైపులా స్క్రాప్ చేయడానికి ఇవి సరైనవి. మైక్రోప్లేన్ గ్రేటర్ లను కూడా చాలా మంది ఉపయోగిస్తుంటారు. సిట్రస్ పండ్లను రుచి చూడడానికి, జున్ను తురుము వేయడానికి, మరిన్నింటికి అనువైన బహుముఖ తురుము పీట ఈ మైక్రోప్లేన్ గ్రేటర్. మరి తెచ్చేసుకోండి. కిచెన్ షియర్స్ కూడా చాలా మంది ఉపయోగిస్తున్నారు. హెవీ కత్తెరలు అన్నమాట. మూలికలను కత్తిరించడం, ప్యాకేజ్ లను ఓపెన్ చేయడం, మరిన్ని వంటి వివిధ వంటగది పనులను నిర్వహించగలవు ఇవి.

    ఎలక్ట్రిక్ కెటిల్ లను కూడా ఉపయోగించేయండి. టీ, కాఫీ, ఇన్‌స్టంట్ సూప్‌ల కోసం నీటిని త్వరగా మరిగించే సౌకర్యవంతమైన కెటిల్ ఇది. మీకు పెద్దగా కష్టం ఉండదు. గార్లిక్ ప్రెస్ కూడా మంచి పరికరమే. వెల్లుల్లి రెబ్బలను సులభంగా, గజిబిజి లేకుండా చూర్ణం చేసే ఒక సాధారణ గాడ్జెట్. సో కొనుగోలు చేసేయండి.

    ముఖ్యమైన విషయం ఏంటంటే? ఎలాంటి పరికరాలు లేకుండా కూడా గతంలో ఆరోగ్యకరమైన, రుచికరమైన భోజనాలు తయారు చేశారు మన అమ్మమ్మనానమ్మలు. సో డబ్బులు హృదా చేసే పరికరాలను కొనుగోలు చేసే ముందు ఒకసారి ఆలోచించండి. మీ బడ్జెట్ ను ఆలోచించి మీకు అవసరమయ్యే పరికరాలను కొనుగోలు చేయడం ముఖ్యం.