Pushpa 2 : సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళ టాలెంట్ ని చూపించుకుంటూ ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ వస్తున్నారు. అయితే ఎవరు ఏం చేసినా కూడా అల్టిమేట్ గా వారి లక్ష్యం మాత్రం స్టార్ హీరోగా ఎదగడమే… మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడున్న కొంతమంది స్టార్ హీరోలు వాళ్ళకంటూ సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక దానికి అనుగుణంగానే కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు… మరి పాన్ ఇండియాలో భారీ వసూళ్లను రాబట్టే హీరోలు ఎవరు అనేది కూడా తెలియాల్సి ఉంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అల్లు అర్జున్ తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటు ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటివరకు పాన్ ఇండియాలో ఆయన మంచి విజయాలను సాధిస్తూ వస్తున్నాడు. పుష్ప సినిమాతో ఎప్పుడైతే బాలీవుడ్ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడో అప్పటినుంచి ఆయనకు బాలీవుడ్ లో కూడా మార్కెట్ అయితే పెరిగింది. ఇక దానికి తగ్గట్టుగానే ఈ రోజు రిలీజ్ అయిన పుష్ప 2 సినిమా కూడా పాజిటివ్ టాక్ ను అందుకుంటూ ముందుకు దూసుకెళ్ళడం అనేది అతనికి చాలా వరకు కలిసి వచ్చే అంశమనే చెప్పాలి. ఇక ఈరోజు గడిస్తే ఈ సినిమాకి మొదటి రోజు ఎంత కలెక్షన్స్ వచ్చాయి అనే విషయం మీద సరైన క్లారిటీ అయితే వస్తుంది. కాబట్టి ఈ సినిమా మొదటి రోజు చాలా సినిమాల రికార్డులను బ్రేక్ చేయబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే భారీ రేంజ్ లో బుకింగ్స్ జరుపుకున్న ఈ సినిమా మూడు రోజుల్లోనే దేవర సినిమా కి ఓవరాల్ గా ఎంత కలెక్షన్స్ అయితే వచ్చాయో ఆ కలెక్షన్స్ మొత్తాన్ని బ్రేక్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి దేవర సినిమాకి 450 కోట్ల వరకు కలెక్షన్స్ అయితే వచ్చాయి.
కాబట్టి పుష్ప మొదటి రోజు 300 కోట్ల కలెక్షన్స్ ను రాబడుతుందంటూ ట్రేడ్ పండితులు కొన్ని అంచనాలైతే వేసుకున్నారు. ఇక ఇది కనక జరిగితే కేవలం రెండు నుంచి మూడు రోజుల్లోనే దేవర సినిమాకు వచ్చిన మొత్తం కలెక్షన్స్ ను బ్రేక్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఇక్కడ ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళుతున్న ఈ హీరో తను మరొకసారి స్టార్ హీరో గా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక పుష్ప 2 సినిమాలో తనదైన మ్యాజిక్ ని చూపించిన అల్లు అర్జున్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తున్నాడు.
మొదటినుంచి చివరి వరకు ఈ సినిమాలో పుష్పరాజ్ క్యారెక్టర్ లో లీనమైపోయి నటించాడనే చెప్పాలి. ఇక ఎక్కడ కూడా డివియేషన్స్ లేకుండా తన క్యారెక్టర్ ను చాలా గొప్పగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక ఇప్పుడు కూడా ఆయన చేయబోతున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. మరి పుష్ప సినిమా లాంగ్ రన్ లో ఎంత కలెక్షన్స్ ని వసూలు చేస్తుందనేది ఇప్పుడు కీలకంగా మారబోతుంది…