https://oktelugu.com/

Pushpa 2 : ‘పుష్ప 2’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు..7వ రోజు ఆల్ టైం వరల్డ్ రికార్డు..అల్లు అర్జున్ కి తప్ప ఇది ఎవరికీ సాధ్యం కాదేమో!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2 : ది రూల్' చిత్రం నిన్నటితో ప్రతిష్టాత్మక 1000 కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి అడుగుపెట్టింది.

Written By:
  • Vicky
  • , Updated On : December 12, 2024 / 09:35 AM IST

    Pushpa 2

    Follow us on

    Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రం నిన్నటితో ప్రతిష్టాత్మక 1000 కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి అడుగుపెట్టింది. సాధారణంగా మన పాన్ ఇండియన్ స్టార్ హీరోలకు వెయ్యి కోట్ల రూపాయిల టార్గెట్ అనేది ఫుల్ రన్ లో ఉంటుంది. అలాంటి టార్గెట్ ని ‘పుష్ప 2’ చిత్రం కేవలం మొదటి వారంలోనే అందుకోవడం అందరిని షాక్ కి గురి చేసింది. భవిష్యత్తులో కూడా ఇలా మొదటి వారం లో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టే సినిమాలు రావొచ్చు గాక. కానీ మొదటి వారంలో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ కొల్లగొట్టిన మొట్టమొదటి హీరోగా మాత్రం అల్లు అర్జున్ పేరు శాశ్వతంగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది. ఆరవ రోజు 67 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, 7వ రోజు 55 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

    వరల్డ్ వైడ్ గా ప్రస్తుతం థియేటర్స్ లో నడుస్తున్న సినిమాలు, హాలీవుడ్ తో కలిపి కూడా పుష్ప 2 రేంజ్ లో ట్రెండింగ్ అవుతున్న సినిమా లేదు. ఆ విధంగా ఈ చిత్రంలో ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. ఇదంతా పక్కన పెడితే వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మొదటి వారం 161 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, 240 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక హిందీ వెర్షన్ లో ఈ చిత్రానికి మొదటి వారం 420 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు, 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది బాలీవుడ్ హిస్టరీ లోనే ఆల్ టైం రికార్డుగా చెప్పుకుంటున్నారు అక్కడి ట్రేడ్ పండితులు.

    ఈ వీకెండ్ తో ఈ చిత్రం బాలీవుడ్ లో జవాన్, స్త్రీ2 వసూళ్లను దాటి ఆల్ టైం రికార్డు గ్రాసర్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇప్పటి వరకు బాలీవుడ్ లో అక్కడి హీరోలు మాత్రమే ఆల్ టైం ఇండస్ట్రీ హిట్స్ కొడుతూ వచ్చారు. మొట్టమొదటిసారి ఇప్పుడు అల్లు అర్జున్ ఆల్ టైం రికార్డు గ్రాసర్ ని హిందీ వెర్షన్ లో కొట్టబోతున్నాడు. ఇది ఆయన అభిమానులు జీవితాంతం గర్వం గా చెప్పుకోవచ్చు. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే, ఇప్పటి వరకు ఈ చిత్రానికి అక్కడ 188 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఈ వీకెండ్ కూడా భారీగా ఉండనుంది. 7 వ రోజు నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి మూడు లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అందులో అధిక శాతం హిందీ నుండి రావడం గమనార్హం. అదే కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రాంతాలకు కలిపి మరో 130 కోట్ల రూపాయిల గ్రాస్, మొత్తం మీద మొదటి వారం ఈ చిత్రానికి 1057 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు ట్రేడ్ పండితులు చెప్తున్నారు.