https://oktelugu.com/

Allu Arjun : ఉత్తమ నటుడు క్యాటగిరీలో ‘ఆస్కార్’ అవార్డ్స్ రేస్ లోకి అల్లు అర్జున్..? ఫ్యాన్స్ కి త్వరలోనే సంచలన ప్రకటన!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' చిత్రం మొదటి వారంలోనే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టి, ఆల్ టైం రికార్డు గ్రాసర్ అయ్యే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : December 12, 2024 / 09:41 AM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం మొదటి వారంలోనే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టి, ఆల్ టైం రికార్డు గ్రాసర్ అయ్యే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఫుల్ రన్ లో ఈ చిత్రం 2000 కోట్ల రూపాయిల మార్కుని అందుకుంటుందో లేదో చెప్పలేము కానీ, 1500 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని మాత్రం కచ్చితంగా అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఈ సినిమా ఇంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకటి సీక్వెల్ క్రేజ్, బ్లాక్ బస్టర్ హిట్ టాక్ కాగా, మరొకటి అల్లు అర్జున్ నటన. ప్రారంభం సన్నివేశం నుండి ఎండింగ్ వరకు ఆయన తన నట విశ్వరూపాన్ని చూపించాడనే చెప్పాలి. అనేక సన్నివేశాలు కేవలం అల్లు అర్జున్ వల్లే హైలైట్ అయ్యాయి. ముఖ్యంగా జాతర సన్నివేశం గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి.

    గడిచిన పదేళ్లలో ఒక సన్నివేశానికి థియేటర్స్ లో ఆడియన్స్ పూనకాలు వచ్చి ఊగిపోయే పరిస్థితులు కేవలం ఈ సినిమా విషయంలోనే జరిగింది. ఈ సన్నివేశం లో అల్లు అర్జున్ నటన, డ్యాన్స్ ని థియేటర్స్ నుండి బయటకి వచ్చిన తర్వాత కూడా మరచిపోలేము. కేవలం ఈ సన్నివేశం కోసం పదే పదే థియేటర్స్ కి రిపీట్ గా వెళ్లొచ్చు. అలాంటి అద్భుతమైన గూస్ బంప్స్ అనుభూతిని కలిగించింది ఈ సన్నివేశం. ఇది కేవలం అల్లు అర్జున్ వల్లే సాధ్యమైంది. అదే విధంగా క్లైమాక్స్ లో కూడా ఆయన తన నట విశ్వరూపాన్ని చూపించాడు. థియేటర్స్ లో చూసే ఆడియన్స్ కి అనేక సార్లు గూస్ బంప్స్ వచ్చాయంటే అందుకు కారణం అల్లు అర్జున్ నటనే. అందుకే ఈ సినిమాతో మరోసారి ఆయన నేషనల్ అవార్డు ని పొందుతాడని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. అయితే కొంతమంది ప్రముఖులు అల్లు అర్జున్ నేషనల్ స్థాయిని దాటిపోయాడని, ఇప్పుడు అతని స్థాయి ఇంటర్నేషనల్ అని అంటున్నారు.

    మేకర్స్ గట్టిగా పట్టుబట్టి, ఈ చిత్రాన్ని ఆస్కార్ అవార్డ్స్ జ్యూరీ కి పంపిస్తే, కచ్చితంగా అల్లు అర్జున్ ఉత్తమ నటుడి క్యాటగిరీ లో నామినేట్ అవుతాడని, కచ్చితంగా ఆయనకీ ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని అంటున్నారు. ఆ దిశగా వాళ్ళు త్వరలోనే అడుగులు కూడా వెయ్యబోతున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చేయబోతున్నట్టు సమాచారం. మన టాలీవుడ్ లో ఉత్తమ నటుడి క్యాటగిరి లో నేషనల్ అవార్డుని సంపాదించిన మొట్టమొదటి హీరో అల్లు అర్జున్ ఎలా నిల్చాడో, ఆస్కార్ అవార్డు పొందిన మొట్టమొదటి ఇండియన్ హీరో గా అల్లు అర్జున్ కచ్చితంగా నిలుస్తాడని, టాలీవుడ్ కి మాత్రమే కాదు, ఆయన దేశానికే గర్వకారణంగా నిలుస్తాడని అభిమానులు చాలా బలమైన నమ్మకంతో ఉన్నారు. మరి అభిమానుల కల నెరవేరుతుందో లేదో చూడాలి.