https://oktelugu.com/

Bigg Boss Telugu 8: గౌతమ్ కి బిగ్ బాస్ స్పెషల్ ట్రీట్మెంట్..విన్నర్ ని చేసేందుకు రేపటి ఎపిసోడ్ లో మాస్టర్ ప్లాన్..విషయం తెలుసుకొని షాక్ లో కంటెస్టెంట్స్!

ఈ సీజన్ లోకి వైల్డ్ కార్డు గా అడుగుపెట్టిన గౌతమ్ కృష్ణ టైటిల్ ని గెలుచుకొని చరిత్ర సృష్టించబోతున్నాడా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అధికారిక ఓటింగ్ లో నిఖిల్ కి, గౌతమ్ కి మధ్య పోరు నువ్వా నేనా అనే విధంగా ఉంది. ఎవరు లీడింగ్ లో ఉన్నా, ఇద్దరి మధ్య తేడా చాలా తక్కువ ఉంటుంది.

Written By:
  • Vicky
  • , Updated On : December 12, 2024 / 09:04 AM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8: ఒక వైల్డ్ కార్డు కంటెస్టెంట్ బిగ్ బాస్ టైటిల్ గెలవడం అనేది తెలుగు లోనే కాదు, ఏ భాషలో కూడా జరగలేదు. హిందీ లో ఇప్పటి వరకు 18 సీజన్స్ జరిగాయి, ఒక్క సీజన్ లో కూడా వైల్డ్ కార్డు కంటెస్టెంట్ టైటిల్ ని గెలవలేదు. కానీ హిందీ ఓటీటీ సీజన్ 2 లో మాత్రం ఎల్విష్ యాదవ్ అనే అతను గత సీజన్ లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టి టైటిల్ ని గెలుచుకున్నాడు. అయితే ఇప్పుడు టీవీ టెలికాస్ట్ సీజన్స్ లో ఈ సీజన్ లోకి వైల్డ్ కార్డు గా అడుగుపెట్టిన గౌతమ్ కృష్ణ టైటిల్ ని గెలుచుకొని చరిత్ర సృష్టించబోతున్నాడా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అధికారిక ఓటింగ్ లో నిఖిల్ కి, గౌతమ్ కి మధ్య పోరు నువ్వా నేనా అనే విధంగా ఉంది. ఎవరు లీడింగ్ లో ఉన్నా, ఇద్దరి మధ్య తేడా చాలా తక్కువ ఉంటుంది.

    మొన్నటి వరకు నిఖిల్ టాప్ లీడింగ్ లో ఉండగా, నిన్నటి నుండి స్వల్ప మెజారిటీ తో గౌతమ్ లీడింగ్ లోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇదంతా పక్కన పెడితే ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టాప్ 5 కంటెస్టెంట్స్ కి సంబంధించిన AV వీడియో లు నిన్నటి నుండి మొదలు పెట్టారు. నిన్న గౌతమ్, అవినాష్, నిఖిల్ కి సంబంధించిన AV వీడియో లు వేసారట. ఈ ముగ్గురిలో గౌతమ్ కి సంబంధించిన AV వీడియో ని మొట్టమొదట వేసారట. ఆయన బిగ్ బాస్ జర్నీ ని మొత్తం అద్భుతంగా చూపిస్తూ, ఆయన గురించి బిగ్ బాస్ ఎలివేషన్స్ ఇస్తూ ఒక రేంజ్ లో లేపాడట. ఇది అతని ఓటింగ్ పెరిగేందుకు వీలుగా ఉంటుంది. అంతే కాకుండా గౌతమ్ కి ఇప్పుడు మరో అడ్వాంటేజ్ కూడా కలిసొచ్చింది. అందరికంటే ముందుగా ఆయన AV నే వేశారు కాబట్టి, ఆయన ఓటింగ్ పై మిగిలిన కంటెస్టెంట్స్ కంటే ఒక రోజు ముందు ప్రభావం పడనుంది.

    ఇప్పటికే అధికారిక ఓటింగ్స్ లో లీడ్ ని చూపిస్తున్న గౌతమ్, ఈ ఎపిసోడ్ తో మరింత తన గ్రాఫ్ ని పెంచుకునే అవకాశం కూడా ఉంది. ఒకవేళ గౌతమ్ టైటిల్ ని గెలుచుకుంటే మాత్రం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరికీ పెద్ద షాక్ అనే చెప్పాలి. ముఖ్యంగా విష్ణు ప్రియ, యష్మీ వంటి వాళ్లకు గౌతమ్ అంటే అసలు నచ్చదు. ఇక హౌస్ లోపల ఉన్నటువంటి నిఖిల్, ప్రేరణ, నబీల్ వంటి వారికి కూడా గౌతమ్ అంటే ఒక రకమైన అసూయ, కోపం ఉంటుంది. కాబట్టి వీళ్లు కూడా గౌతమ్ కి టైటిల్ రావడాన్ని తట్టుకోలేరు. మరి ఏమి జరగబోతుందో చూడాలి. బిగ్ బాస్ టీం మాత్రం ఎక్కువగా గౌతమ్ ని విన్నర్ ని చేసేందుకే పుష్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ వారం మొత్తం నిఖిల్ కంటెంట్ చాలా తక్కువ చూపించారు టీవీ టెలికాస్ట్ లో.