Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ‘ చిత్రం మొదటి వీకెండ్ లో సాధించిన వసూళ్లను చూసి ట్రేడ్ పండితులకు కూడా మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇన్ని రోజులు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల వసూళ్లను పరిశీలించాం, కానీ పుష్ప 2 కి వస్తున్న వసూళ్లు మాత్రం ఎప్పుడూ చూడలేదంటూ సోషల్ మీడియా లో బహిరంగంగా కామెంట్స్ చేయడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. కేవలం తెలుగు లో బ్లాక్ బస్టర్ అవ్వడం వేరు, విడుదలైన ప్రతీ భాషలోనూ బ్లాక్ బస్టర్ అవ్వడం వేరు. పుష్ప పార్ట్ 1 విషయంలో అదే జరిగింది, పార్ట్ 2 విషయంలో అంతకు మించి ఎక్కువ జరిగింది. తెలుగు కంటే హిందీ లో అత్యధిక వసూళ్లు రావడం అనేది అల్లు అర్జున్ అభిమానులకు కూడా పెద్ద షాక్. హిందీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఇంతలా ఎలా ఆదరిస్తున్నారో వాళ్లకు కూడా అర్థం కాలేదు.
సాధారణంగా ఒక లాంగ్ వీకెండ్ తర్వాత వర్కింగ్ డే రోజున ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అయినా కలెక్షన్స్ లో భారీ డ్రాప్స్ చూడడం సహజం. కానీ ‘పుష్ప 2’ విషయంలో అది జరగడం లేదు. మొదటి నాలుగు రోజులకు కలిపి ఈ సినిమా హిందీ వెర్షన్ లో 285 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. 5 వ రోజున ఈ చిత్రానికి హిందీ వెర్షన్ లో 43 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. గ్రాస్ లెక్కలో చూస్తే దాదాపుగా 60 కోట్ల రూపాయిలు ఉంటుంది. అదే విధంగా తెలుగు వెర్షన్ లో ఈ చిత్రానికి 24 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు సమాచారం. అలా 5 వ రోజు ఈ చిత్రానికి హిందీ, తెలుగు వెర్షన్స్ కి కలిపి 84 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కేవలం ఇండియా లో వచ్చింది.
అదే విధంగా తమిళ వెర్షన్ లో 5 వ రోజు దాదాపుగా ఆరు కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చినట్టు సమాచారం. కేరళ లో 2 కోట్లు, కర్ణాటక లో 2 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చిందని అంటున్నారు. ఓవరాల్ గా ఇండియా లో అన్ని వెర్షన్స్ కి కలిపి 5వ రోజు 94 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. అదే విధంగా ఓవర్సీస్ లో 5వ రోజు తెలుగు వెర్షన్ వసూళ్లు భారీగా తగ్గిపోయాయి. అక్కడ కూడా హిందీ వెర్షన్ వసూళ్లు ఈ చిత్రాన్ని కాపాడాయి అని చెప్పొచ్చు. ఓవరాల్ గా నార్త్ అమెరికా లో నాలుగు లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తే, అందులో కేవలం హిందీ వెర్షన్ నుండి మూడు లక్షల డాలర్లు వచ్చాయి. ఓవరాల్ గా ఓవర్సీస్ లో హిందీ, తెలుగు వెర్షన్స్ కి కలిపి నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని, ఓవరాల్ గా 5వ రోజు ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 98 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు ట్రేడ్ పండితులు చెప్తున్నారు.