https://oktelugu.com/

Pushpa 2 : 5 రోజుల్లో 900 కోట్లు..బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ ‘జవాన్’ క్లోజింగ్ కలెక్షన్స్ ని ‘పుష్ప 2’ మొదటి వారంలోనే దాటనుందా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2 : ది రూల్' చిత్రం 5 రోజుల క్రితం భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకో అద్భుతాన్ని సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : December 10, 2024 / 10:51 AM IST

    Pushpa 2

    Follow us on

    Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రం 5 రోజుల క్రితం భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకో అద్భుతాన్ని సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇండియన్ సినీ ఇండస్ట్రీ హిస్టరీ లో బాక్స్ ఆఫీస్ లెక్కలు ‘పుష్ప 2’ చిత్రానికి ముందు, ‘పుష్ప 2’ తర్వాత అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. మొదటి వారం లో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకోబోతున్న మొట్టమొదటి ఇండియన్ చిత్రంగా ‘పుష్ప 2’ సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. 5 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 900 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుకి చాలా దగ్గరగా వచ్చింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 5 రోజుల్లో 898 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట.

    ప్రాంతాల వారీగా 5 రోజుల్లో ఎంత గ్రాస్ వచ్చింది, ఎంత షేర్ వచ్చింది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ చిత్రానికి చిత్రానికి 5 రోజుల్లో 152 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 225 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 215 కోట్ల రూపాయలకు జరిగింది. ఈ వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ మార్కుకి అతి చేరువ కాబోతుందని, ఫుల్ రన్ లో పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అదే విధంగా కర్ణాటక ప్రాంతంలో 5 రోజులకు 32 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, 55 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తుంది. అదే విధంగా కేరళలో 19 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, తమిళనాడు లో 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.

    ఇక హిందీ వెర్షన్ లో ఈ చిత్రానికి 5 రోజులకు కలిపి 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని, ఓవర్సీస్ లో హిందీ + తెలుగు వెర్షన్ కి కలిపి ఇప్పటి వరకు 165 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీ భాషలకు కలిపి 898 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని, ఈరోజు మరియు రేపటితో 1000 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని దాటేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఫుల్ రన్ లో ఇదే రన్ కొనసాగితే బాహుబలి 2 క్లోజింగ్ వసూళ్లు 1800 కోట్ల రూపాయిల గ్రాస్ ని, అదే విధంగా దంగల్ క్లోజింగ్ వసూళ్లు 2000 కోట్ల రూపాయిల గ్రాస్ ని ఈ చిత్రం అవలీలగా దాటేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

    Tags