Pushpa 2 : ప్రస్తుతం ప్రపంచం మొత్తం పుష్ప 2 సినిమా హవా నడుస్తుందనే చెప్పాలి. ఇక ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కడమే కాకుండా భారీ వసూళ్లను కూడా రాబడుతూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక బెంచ్ మార్క్ ను సెట్ చేస్తోంది. ఇక ఇప్పటివరకు వచ్చిన పాన్ ఇండియా సినిమాలన్నీ ఒకేతైతే పుష్ప 2 సినిమా సక్సెస్ అనేది మరొకెత్తనే చెప్పాలి…
మొదట్లో స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు అల్లు అర్జున్… ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు చేస్తున్న సినిమాలతో మరోసారి భారీ పెను ప్రభంజనాన్ని సృష్టించాడనే చెప్పాలి. ఆయన లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారు. నిజానికి ఆయనతో పాటు సినిమాలు చేస్తున్న చాలామంది హీరోల కంటే కూడా ఆయన కొత్త తరహా విధానాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నాడు. అందువల్లే ఆయనకు పాన్ ఇండియాలో భారీ క్రేజ్ అయితే దక్కుతుంది. ఇక ఇదిలా ఉంటే పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారాడు. ఇక రీసెంట్ గా పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన భారీ పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి ని కూడా క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు… ఇక ఇదిలా ఉంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయిన దేవిశ్రీప్రసాద్ కి ప్రొడ్యూసర్స్ కి మధ్య కొంతవరకు విభేదాలు వచ్చాయనే విషయం అప్పట్లో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ఇంకా దాంతోపాటు వాళ్లు బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడానికి తమన్ చేత ఒక వెర్షన్ కొట్టించారు.
ఇక తమన్ ఇచ్చిన నేపథ్య సంగీతం కూడా పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడంతో శ్యామ్ సిఎస్ లాంటి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ తో బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే చేయించారు. ఇక దానికోసం శ్యామ్ సి ఎస్ కి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ముట్టజెప్పినట్టుగా తెలుస్తోంది.
ఇక ఇంతకీ శ్యామ్ సిఎస్ ఈ సినిమా చేయడానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడనే విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం దాదాపు ఆయన రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ చార్జ్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఇక దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో రెండు కోట్లు బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం వెచ్చించడం పెద్ద కష్టమేమీ కాదని సుకుమార్ ఇలాంటి ఒక సాహసాన్ని చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి చాలా వరకు ప్లస్ అయిందనే చెప్పాలి…