Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ బాక్స్ ఆఫీస్ వద్ద వైల్డ్ ఫైర్ లాగా బ్లాస్ట్ అయ్యి 11 రోజులు పూర్తి అయ్యింది. రోజులు గడిచే కొద్దీ వైల్డ్ ఫైర్ కాస్త తగ్గుతుందేమో అని అనుకున్నారు. కానీ రోజురోజుకి ఆ ఫైర్ ఇంకా పెరుగుతూ పోయింది. ఇక వీకెండ్ వచ్చిందంటే చాలు అగ్ని పర్వతం బద్దలైనట్టు బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. ఈ స్థాయి సంచలనం సృష్టిస్తుందని బహుశా ఎవ్వరూ ఊహించి ఉండరు. సీక్వెల్ క్రేజ్ తో వస్తున్న సినిమా కాబట్టి, కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్, క్లోజింగ్స్ బలంగా ఉంటాయని అందరూ ఊహించిందే. కానీ ప్రతిష్టాత్మక వెయ్యి కోట్ల రూపాయిల క్లబ్ లోకి కేవలం వారం రోజుల్లోనే చేరుతుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. 10 రోజుల్లో ఈ చిత్రానికి దాదాపుగా 14 మిలియన్ కి పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఇది సాధారణమైన విషయం కాదు.
నిన్న ఒక్క రోజే ఈ చిత్రానికి 1 మిలియన్ కి పైగా టిక్కెట్లు అమ్ముడుపోయి ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వసూళ్ల విషయానికి వస్తే దాదాపుగా వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టిందని అంటున్నారు. మొత్తం మీద ఈ చిత్రం 11 రోజులకు వరల్డ్ వైడ్ గా ఎంత గ్రాస్ వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 11 వ రోజు 18 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంచనా వేస్తున్నారు. హిందీ వెర్షన్ లో అయితే కనివిని ఎరుగని రేంజ్ లో వచ్చాయి. అక్కడి ట్రేడ్ పండితులు అంచనా ప్రకారం ఈ సినిమాకి 11 వ రోజు 58 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు, 70 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. నిన్నటితో ఈ చిత్రానికి కేవలం హిందీ వెర్షన్ వరకు 565 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు, 650 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట.
ఇన్ని రోజులు మన తెలుగు డబ్బింగ్ హిందీ సినిమాలు 8 ఏళ్ళ క్రితం విడుదలైన బాహుబలి 2 హిందీ వెర్షన్ వసూళ్లను బ్రేక్ చేయాలనీ టార్గెట్ గా పెట్టుకొని విఫలం అయ్యాయి. కానీ పుష్ప 2 చిత్రం కేవలం 11 రోజుల్లోనే ఆ టార్గెట్ ని దాటేసింది. ఇక పుష్ప 2 చిత్రం ముందు ఉన్నది కేవలం స్త్రీ 2 , ఎనిమల్, జవాన్, పఠాన్ చిత్రం మాత్రమే. ఈ వీకెండ్ తో ఆ సినిమాల వసూళ్లను కూడా దాటి ఆల్ టైం బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ చిత్రం గా నిలవబోతుంది. ఓవరాల్ గా 11 రోజులకు ఈ చిత్రం 1350 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను వరల్డ్ వైడ్ గా రాబట్టింది. ఫుల్ రన్ లో కచ్చితంగా 1500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని సాధిస్తుంది, కానీ 2000 కోట్ల టార్గెట్ ని అందుకుంటుందా లేదా అనేది చూడాలి.