https://oktelugu.com/

Trivikram : త్రివిక్రమ్ చిరంజీవి తో చేయాల్సిన సినిమాను అల్లు అర్జున్ తో చేస్తున్నాడా..?

తెలుగు సినిమా స్థాయిని పెంచిన హీరోల్లో చిరంజీవి ఒకరు. 150 కి పైన సినిమాలను చేసి సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్న చిరంజీవి ఈ ఏజ్ లో కూడా తన ఐడెంటిటిని చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : December 16, 2024 / 09:38 AM IST

    Trivikram

    Follow us on

    Trivikram : తెలుగు సినిమా స్థాయిని పెంచిన హీరోల్లో చిరంజీవి ఒకరు. 150 కి పైన సినిమాలను చేసి సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్న చిరంజీవి ఈ ఏజ్ లో కూడా తన ఐడెంటిటిని చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడున్న యంగ్ హీరోలతో పోటీపడుతూ మరి నటించడం అంటే మామూలు విషయం కాదు… ప్రస్తుతం ఆయన పాన్ ఇండియాలో తన సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయనతో సినిమాలు చేయడానికి యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరు ఎదురుచూస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన తో సినిమా చేయడానికి ఒక స్టార్ డైరెక్టర్ ఆసక్తి చూపించినప్పటికి ఆ ప్రాజెక్ట్ అయితే వర్కౌట్ కాలేదు… మాటల మాంత్రికుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ చిరంజీవితో ఒక భారీ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా అయితే పట్టాలెక్కలేదు. కారణం ఏదైనా కూడా వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని యావత్ తెలుగు సినిమా అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఈ సినిమా అనౌన్స్ అయ్యేలోపే అటకెక్కేసింది అంటూ కొన్ని వార్తలైతే బయటకు వచ్చాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అప్పుడు చిరంజీవితో చేయాలనుకున్న కథనే కొంచెం మార్పులు చేర్పులు చేసి ప్రస్తుతం త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో చేస్తున్నాడు అంటూ కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి.

    మరి ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ కి ఇప్పుడు పాన్ ఇండియాలో మంచి మార్కెట్ అయితే ఉంది. మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్ళీ రొటీన్ రొట్ట కథలు చేయకుండా నిజాయితీగా ఒక మంచి కథను చెప్పగలిగితే మాత్రం ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ హీరోగా పెట్టి చేస్తున్న సినిమా కోసం భారీ కసరత్తులైతే చేస్తున్నాడు. మరి చిరంజీవితో చేయాల్సిన కథతోనే ఈ సినిమా చేస్తున్నాడా లేదంటే ఒక ఫ్రెష్ కథని అల్లు అర్జున్ కోసం రెడీ చేసుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది.

    మరి ఏది ఏమైనా కూడా చిరంజీవితో ఆపర్చునిటీ మిస్ అయినందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలావరకు మదన పడుతున్నడట చిరంజీవిని లైఫ్ టైం లో ఒక్కసారైనా డైరెక్ట్ చేయాలనే కోరిక ప్రతి ఒక్క డైరెక్టర్ కి ఉంటుంది. కానీ ఆ అవకాశం అందరికీ రాకపోవచ్చు ఎందుకంటే ఆయన మాత్రం ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఎవరైతే తనని చాలా బాగా ప్రజెంట్ చేయగలరో వాళ్లకు మాత్రమే సినిమాలు చేసే అవకాశాలను ఇస్తున్నాడు… చూడాలి మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ చిరంజీవి కాంబినేషన్ లో ఫ్యూచర్ లో ఏదైనా సినిమా వస్తుందా లేదా అనేది…