Homeఎంటర్టైన్మెంట్Puri Vijay Sethupathi Film Delay: పూరి - విజయ్ సేతుపతి మూవీ రిలీజ్ లేట్...

Puri Vijay Sethupathi Film Delay: పూరి – విజయ్ సేతుపతి మూవీ రిలీజ్ లేట్ అవ్వడానికి కారణం ఇదే…

Puri Vijay Sethupathi Film Delay: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్… ఒకప్పుడు ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు పూర్తి అటెన్షన్ తో ఉండేవారు. ఇప్పుడు ఆయన సినిమా వస్తుందని చెప్పినా కూడా పట్టించుకోవడం లేదంటే ఆయన క్రేజ్ ఏ స్థాయికి పడిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం విజయ్ సేతుపతిని హీరోగా పెట్టి ఆయన చేస్తున్న స్లమ్ డాగ్ సినిమా […]

Puri Vijay Sethupathi Film Delay: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్… ఒకప్పుడు ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు పూర్తి అటెన్షన్ తో ఉండేవారు. ఇప్పుడు ఆయన సినిమా వస్తుందని చెప్పినా కూడా పట్టించుకోవడం లేదంటే ఆయన క్రేజ్ ఏ స్థాయికి పడిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం విజయ్ సేతుపతిని హీరోగా పెట్టి ఆయన చేస్తున్న స్లమ్ డాగ్ సినిమా తొందరలోనే రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో అయిపోయినప్పటికి ఇంకా సినిమా రిలీజ్ కి నోచుకోకపోవడానికి గల కారణం ఏంటి అంటూ పూరి జగన్నాథ్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. నిజానికి పూరి జగన్నాథ్ గత సినిమాల విషయంలో చాలావరకు ఇబ్బంది పడ్డాడు.

లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో భారీ నష్టాలను చవి చూసిన పూరి జగన్నాథ్ ఆ సినిమాలను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు విపరీతంగా నష్టపోయారు. దానికి నష్టపరిహారం చెల్లించాలి అంటూ పూరి జగన్నాథ్ వద్దకు వచ్చినప్పటికి ఆయన వారిని పట్టించుకోకపోవడంతో వాళ్ళు పూరి జగన్నాథ్ మీద తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

పూరి నుంచే వచ్చే ఏ సినిమాని వాళ్ళు కొనకూడదనే ఒక నిర్ణయాన్ని పెట్టుకున్నారు. ప్రస్తుతం పూరి స్లమ్ డాగ్ సినిమా రిలీజ్ విషయంలో కూడా అలాంటి ఇబ్బందులను ఎదుర్కొక తప్పడం లేదంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇక దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే విషయం మీద సరైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు…

మరి పూరి జగన్నాథ్ లాంటి స్టార్ డైరెక్టర్ ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవడం చూస్తున్నా అతని అభిమానులు తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు భారీ సక్సెస్ ను సాధించి పెట్టిన ఆయన ఇప్పుడు మాత్రం ఒక సక్సెస్ ని సాధించడానికి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper