Homeఎంటర్టైన్మెంట్Nandamuri Balakrishna: బాలయ్య సినిమా లైనప్ మామూలుగా లేదుగా...

Nandamuri Balakrishna: బాలయ్య సినిమా లైనప్ మామూలుగా లేదుగా…

Nandamuri Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలయ్య బాబుకి ప్రత్యేకమైన గుర్తింపైతే ఉంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాయి. కమర్షియల్ సక్సెస్ లను సాధించడంలో బాలయ్య ముందు వరుసలో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న ఒక సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. […]

Nandamuri Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలయ్య బాబుకి ప్రత్యేకమైన గుర్తింపైతే ఉంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాయి. కమర్షియల్ సక్సెస్ లను సాధించడంలో బాలయ్య ముందు వరుసలో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న ఒక సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ సినిమా తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. వీళ్ళిద్దరితో పాటుగా ‘నాంది’ సినిమాతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న విజయ్ కనకమేడల దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇలా వరుసగా బాలయ్య చాలా స్ట్రాంగ్ లైనప్ ను సెట్ చేసుకుంటూ వరస సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక బాలయ్య బాబు నుంచి వచ్చే ప్రతి సినిమా వైవిద్య భరితంగా ఉంటుందని ఆయన తన కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు.

ఎందుకంటే ఆయన ఎంచుకున్న దర్శకులను బట్టే అతని సినిమాలు ఎలా ఉండబోతున్నాయో మనం ఒక అంచనా వేయొచ్చు… ఇక వీళ్ళతోపాటుగా మరి కొంతమంది దర్శకుల కథలను కూడా వింటున్నాడట. ప్రస్తుతానికి బాలయ్య ఒక రెండు సంవత్సరాలపాటు తన డేట్స్ మొత్తాన్ని ఈ ముగ్గురు దర్శకులకు కేటాయించినట్టుగా తెలుస్తుంది.

మరి వీళ్ళు అనుకున్నట్టుగానే సినిమాని తీసి బాలయ్య బాబుకు భారీ విజయాన్ని కట్టబెడతారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఇక ఈ సినిమాని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీలైనంత తొందరలోనే సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఒక గ్లింప్స్ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నారట…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper