https://oktelugu.com/

మొగుడూ పెళ్లాలు అరగంటకంటే ఎక్కువ మాట్లాడుకోవద్దు: పూరి

పూరి జగన్నాధ్ ఒక ముఖ్యమైన సందేశాన్ని తనదైన శైలిలో అందరికీ అర్థమయ్యేలా వివరించారు. సరదా సంభాషనలతో హాస్యాన్ని జోడించి కఠినమైన పంక్తులతో చాలా గంభీరమైన వాయిస్ తో సుతిమెత్తగా చెప్పుకొచ్చారు. కొద్దిరోజులుగా కరోనా లాక్ డౌన్ తో సినిమా షూటింగ్ లన్నీ నిలిచిపోవడంతో టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తనదైన శైలిలో ‘పూరి మ్యూజింగ్స్‌’ పేరిట తన అభిప్రాయలు యూట్యూబ్ లో వెల్లడిస్తున్నాడు. తాజాగా కరోనా కాలంలో భార్యాభర్తల సంబంధాలు- విడాకుల గురించి ఒక అంశాన్ని వివరించారు. […]

Written By: , Updated On : June 3, 2021 / 04:31 PM IST
Follow us on

పూరి జగన్నాధ్ ఒక ముఖ్యమైన సందేశాన్ని తనదైన శైలిలో అందరికీ అర్థమయ్యేలా వివరించారు. సరదా సంభాషనలతో హాస్యాన్ని జోడించి కఠినమైన పంక్తులతో చాలా గంభీరమైన వాయిస్ తో సుతిమెత్తగా చెప్పుకొచ్చారు.

కొద్దిరోజులుగా కరోనా లాక్ డౌన్ తో సినిమా షూటింగ్ లన్నీ నిలిచిపోవడంతో టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తనదైన శైలిలో ‘పూరి మ్యూజింగ్స్‌’ పేరిట తన అభిప్రాయలు యూట్యూబ్ లో వెల్లడిస్తున్నాడు. తాజాగా కరోనా కాలంలో భార్యాభర్తల సంబంధాలు- విడాకుల గురించి ఒక అంశాన్ని వివరించారు.

“పురుషులు.. మహిళలు వారు ఒకరితో ఒకరు ఎక్కువగా మాట్లాడుకోవడం సమయం గడపడం వలన ఈ లాక్ డౌన్ సమయంలో గొడవలు ఎక్కువగా అవుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక విడాకులు ఈ కరోనా లాక్ డౌన్ లోనే అయ్యాయని” అని పూరి జగన్నాథ్ వివరించారు. “పురుషులు.. మహిళలు వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతారని.. కానీ ఎక్కువ సేపు కలిసి ఉండడం వారి వారి అంచనాలు అందుకోలేక.. ఫ్రీడం లేక విడాకులకు దారి తీస్తుందని పూరి తెలిపారు..

యూకే తరవాత అమెరికా, చైనాల్లో ఎక్కువగా విడాకులకు దారితీశాయని పూరి జగన్నాథ్ తెలిపారు. భారత్ లో విడాకులు తీసుకున్న వారి సంఖ్య తక్కువే అయినా ఇక్కడా పెరిగాయన్నారు.
గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లు టాప్ 3లో ఉన్నాయి.

గత సంవత్సరం లాక్ డౌన్ నుంచి ఇప్పటిదాకా రోజుకు 25 విడాకుల కేసులు ఫైల్ అవుతున్నాయన్నారు. ఢిల్లీలో అయితే 40శాతం పెళ్లిళ్లు చేసుకున్నవారు విడాకులు తీసుకున్నట్టు తేలింది.

దర్శకుడు పూరి ఈ విడాకుల సమస్యకు ఒక పరిష్కారం ఇచ్చాడు. “పెళ్లి చేసుకున్న దంపతులు ఒకరితో ఒకరు తక్కువ సమయం గడపండి. ఎక్కువ మాట్లాడకండి. ఒకరినొకరు ఫేస్ చేసుకోవద్దు. మీ స్నేహితులతో మాట్లాడండి లేదా టీవీ చూడండి. ఈ కష్ట సమయాల్లో మీ వివాహ బంధాలనీ కాపాడుకోండి” అని వివాహిత జంటలకు పూరి జగన్నాథ్ గొప్ప సలహా ఇచ్చారు. ఇద్దరు ఇంట్లో ఉండకుండా ఉద్యోగాలు చేయాలని అప్పుడే విడాకులు కావని పూరి తెలిపారు. ఇద్దరి కలిసి ఎక్కువ టైం ఉండడం వల్లే ఇలా అవుతుందని తెలిపారు.

“మీరు వివాహనికి ముందు ఒంటరితనం అనుభూతి చెందుతున్నట్లయితే వివాహం చేసుకోవద్దు. వివాహం తర్వాత కూడా మీకు ఒంటరితనం లభిస్తుంది. 2040 నాటికి 30% వివాహాలు మాత్రమే జరుగుతాయి. పురుషులు మరియు మహిళలు ఇద్దరూ ఉద్యోగం చేసి ఉండాలి రెండు సంవత్సరాల పని అనుభవం తప్పనిసరి. అలాగే, పెళ్ళికిముందే వారిద్దరికీ విస్తృతమైన కౌన్సిలింగ్ ఇప్పించాలి”అని పెళ్లికాని జంటలకు సలహా పూరి గొప్ప సలహాలతో సూచనలు ఇచ్చాడు.

DIVORCE | Puri Musings by Puri Jagannadh | Puri Connects | Charmme Kaur