కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టేసరికి.. సినిమా వాళ్ళల్లో ఇప్పుడు షూటింగ్ ఆలోచనలు మొదలయ్యాయి. అయితే ఏ సినిమా షూటింగ్, ఎప్పుడు మొదలు అవుతుందో అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు గానీ, నిర్మాతలు మాత్రం కొత్త షెడ్యూల్స్ కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక ఈ క్రమంలో నేషనల్ స్టార్ ప్రభాస్ మాత్రం వచ్చే నెల నుంచే సెట్ కి వచ్చేద్దామని ప్లాన్ లో ఉన్నాడట.
మరి ఈ ప్లాన్ ప్రభాస్ దా ? లేక, దర్శకనిర్మాతలదా ? అనే విషయం పక్కన పెడితే.. ప్రభాస్ మాత్రం ఒకేసారి మూడు సినిమాలకు డేట్స్ ఇస్తూ షిఫ్ట్ లు వారీగా షూట్ లో పాల్గొంటున్నాడు. కాగా ప్రభాస్ తన మూడు సినిమాల షూటింగ్ ల పై పక్కా షెడ్యూల్ తో డేట్స్ కూడా ప్లాన్ చేశాడట. ముందుగా ప్రభాస్ “రాధే శ్యామ్” షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నాడు. నిజానికి ఈ సినిమాకి సంబంధించి కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే ఉంది. అలాగే ఒక పాట చిత్రీకరణ కూడా మిగిలి ఉంది.
జులైలో ముందుగా ఈ సినిమాకి 10 రోజులు కేటాయించి ఈ సినిమాకి గుమ్మడికాయ కొట్టాలనుకుంటున్నాడు. ఆ తర్వాత ప్రభాస్ “సలార్”, “ఆదిపురుష్” సినిమాలకి డేట్స్ ఇస్తాడట. ఇక ఎలాగూ తెలంగాణాలో కేసుల ఉధృతి తగ్గింది కాబట్టి, ప్రభుత్వం కూడా షూటింగ్స్ పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది. పైగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా రోజురోజుకు పెరుగుతోంది.
ఇప్పటికే కొవిడ్ షీల్డ్ పూర్తి అందుబాటులో ఉంది, అలాగే ఫైజర్, మెడెర్నా వంటి విదేశీ వ్యాక్సిన్లు కూడా త్వరలోనే ఇండియాలోకి రానున్నాయి. మొత్తమ్మీద జులై, ఆగస్టు నాటికి కరోనా సెకెండ్ వేవ్ పరిస్థితులు కుదుటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు కూడా ఓ అంచనాతో ఉన్నారు. ఇవ్వన్నీ దృష్టిలో పెట్టుకునే సినిమా వాళ్ళు షూట్ కి రెడీ అవుతున్నారు.