https://oktelugu.com/

పూరి కథలు.. మహేష్ తోనా ? రానాతోనా ?

కరోనా టైమ్ లో జనం ఎన్ని ఇబ్బందులు పడినా.. మన దర్శకులుకు మాత్రం కొత్త కథలు రాసుకోవడానికి మంచి అవకాశం దొరికింది. చాలామంది దర్శకులు ఇప్పటికే తమ కథలను పూర్తి చేశారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కూడా ఈ కరోనా టైమ్ లో ఓ స్క్రిప్ట్ ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ యంగ్, న్యూ జనరేషన్ హీరో కోసం ఈ కథ తయారుచేసినట్లు.. బాలీవుడ్ వెర్షన్ లో ఓ స్టార్ వారసుడు నటిస్తే.. తెలుగు […]

Written By:
  • admin
  • , Updated On : September 5, 2020 7:05 pm
    Follow us on


    కరోనా టైమ్ లో జనం ఎన్ని ఇబ్బందులు పడినా.. మన దర్శకులుకు మాత్రం కొత్త కథలు రాసుకోవడానికి మంచి అవకాశం దొరికింది. చాలామంది దర్శకులు ఇప్పటికే తమ కథలను పూర్తి చేశారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కూడా ఈ కరోనా టైమ్ లో ఓ స్క్రిప్ట్ ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ యంగ్, న్యూ జనరేషన్ హీరో కోసం ఈ కథ తయారుచేసినట్లు.. బాలీవుడ్ వెర్షన్ లో ఓ స్టార్ వారసుడు నటిస్తే.. తెలుగు వెర్షన్ లో తన కుమారుడిని పెట్టి ఈ కథను తీయాలనేది పూరి ప్లాన్. అందుకే స్క్రిప్ట్ ను శరవేగంగా పూర్తి చేసి… ఎవర్ని ఒప్పించాలా అనే ఆలోచనలో ప్రస్తుతం పూరి ఉన్నాడట.

    Also Read: యాక్షన్ కాంబినేషన్ లో ఫ్యామిలీ డ్రామా !

    ఇదిలా వుంటే ఎప్పటి నుంచో పూరి మదిలో వున్న జనగనమణ సినిమా స్క్రిప్ట్ ను కూడా రెడీ చేసి మహేష్ కి వినిపించాలనేది పూరి చేస్తోన్న మరో ప్లాన్. నిజానికి అప్పట్లోనే మహేష్ బాబుకు పూరి ఈ కథను వినిపించాడు. అప్పుడు మహేష్ కి కథ నచ్చలేదు. మళ్ళీ మార్పులు చేసుకుని వస్తా అని చెప్పిన పూరి, ఆ తరువాత మళ్ళీ మహేష్ దగ్గరకు వెళ్ళలేదు. ఇప్పుడు చేసే మార్పులు కూడా మహేష్ కు నచ్చకపోతే.. రానాతో చేస్తాడట. అందుకే ముందు బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేయాలనుకుంటున్నాడు.

    Also Read: బ్రేకప్ లు, డైవోర్స్ కథలో రామ్ ‌!

    అన్నట్టు భారత దేశంలో అవినీతి జాఢ్యం నేపథ్యంలో ఈ జనగనమణ కథను పూరి రాస్తున్నాడట. అంటే ఈ కథ మొత్తం మన వ్యవస్థలో లోపాల చుట్టూ, అలాగే మన న్యాయ వ్యవస్థలోని డొల్లతనం చుట్టూ కథ సాగుతుందట. ఎలాగూ పూరి నుండి పవర్ ఫుల్ డైలాగులు ఉంటాయి. స్క్రిప్ట్ లో కాస్త విషయం ఉన్న.. దాన్ని పూరి బాగా ఎలివేట్ చేయగలడు. మరీ ఈ జనగనమణ స్క్రిప్ట్, మహేష్ కు నచ్చుతుందో లేక చివరకు రానా దగ్గరకు పోతుందో చూడాలి.