https://oktelugu.com/

రైల్వే ప్రయాణీకులకు గుడ్  న్యూస్

దేశంలో కరోనా ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ విధించింది. దీంతో ప్రజారవాణా స్తంభించిపోయిన సంగతి తెల్సిందే. రైళ్లు, విమానాలు, బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈనేపథ్యంలోనే కేంద్రం ఆన్ లాక్ విధిస్తూ ప్రజారవాణాను తిరిగి గాడిలో పెడుతోంది. ఇప్పటికే అన్నిరంగాలు తిరిగి యథాస్థితికి చేరుకుంటున్న తరుణంలో ట్రైన్లను కూడా కరోనా నిబంధనలతో నడిపిందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. Also Read: రామ మందిరం ఓకే.. మరి బాబ్రీ నిర్మాణం ఎలా ఉండబోతోంది..? ఆన్ లాక్ 4.0లో […]

Written By:
  • NARESH
  • , Updated On : September 5, 2020 / 06:44 PM IST
    Follow us on

    దేశంలో కరోనా ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ విధించింది. దీంతో ప్రజారవాణా స్తంభించిపోయిన సంగతి తెల్సిందే. రైళ్లు, విమానాలు, బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈనేపథ్యంలోనే కేంద్రం ఆన్ లాక్ విధిస్తూ ప్రజారవాణాను తిరిగి గాడిలో పెడుతోంది. ఇప్పటికే అన్నిరంగాలు తిరిగి యథాస్థితికి చేరుకుంటున్న తరుణంలో ట్రైన్లను కూడా కరోనా నిబంధనలతో నడిపిందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది.

    Also Read: రామ మందిరం ఓకే.. మరి బాబ్రీ నిర్మాణం ఎలా ఉండబోతోంది..?

    ఆన్ లాక్ 4.0లో భాగంగా కేంద్రం రైల్వేశాఖకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 12నుంచి దేశంలో ప్రత్యేకంగా 80రైళ్లను నడిపించేందుకు రైల్వేశాఖ సన్నహాలు చేస్తోంది. రైలు ప్రయాణీకులు ఈనెల 10 నుంచి రిజర్వేషన్లు చేసుకోవచ్చని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ తాజాగా ప్రకటించారు. రైల్వే శాఖ తాజాగా నిర్ణయంపై ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    Also Read: ట్రంప్‌ సంస్కరణలు ఇండో అమెరికన్ల ఓట్లు రాల్చేనా

    ప్రస్తుతం రైల్వేశాఖ ప్రయాణికుల డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో 80 ప్రత్యేక రైళ్లను నడిపిస్తుందని తెలిపారు. పరిస్థితులను బట్టి ఈ సంఖ్య మరింత పెంచనుందని తెలుస్తోంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కోరితే పరీక్షల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించింది. అదేవిధంగా గతంలో ఆగిపోయిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును తిరిగి కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రజలు బస్సులు అందుబాటులోకి రాగా ట్రైన్లు కూడా ఈనెల 12నుంచి అందుబాటులోకి వస్తుండటంతో ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.