new journalist from tdp
తెలుగుదేశం పార్టీలో మిగతా నాయకులతో పోలిస్తే నారా లోకేశ్ కు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మీడియా ముందు ఎప్పుడూ నోరు కూడా మెదపని లోకేశ్ బాబు ట్విట్టర్ నుంచి జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు. ఆ ట్వీట్లు స్వయంగా నారా లోకేశ్ పోస్ట్ చేస్తాడో లేక మరెవరైనా ఆయనకు సహాయం చేస్తున్నారో తెలియదు కానీ ఆ ట్వీట్లలో వ్యాకరణ దోషాలు మాత్రం మచ్చుకైనా కనిపించవు.
Also Read : ఏపీ మళ్లీ నంబర్ 1.. కేంద్రం ప్రకటన
అదే లోకేశ్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే మాత్రం జయంతిని వర్ధంతి అని చెబుతూ టీడీపీ అవినీతి పార్టీ అని చెబుతూ పొరపాటు పడి చేసే వ్యాఖ్యలు ఆ పార్టీ నాయకులకే చికాకు తెప్పించే విధంగా ఉంటాయి. అయితే తాజాగా లోకేశ్ బాబు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. ఆయన కొత్తగా జర్నలిస్టు అవతారం ఎత్తారు. గత కొన్ని రోజులుగా నారా లోకేశ్ పేరుతో ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ పేజీలో లోకేశ్ వ్యాసాలు ప్రచురితం అవుతున్నాయి.
మొదట గత నెల 15 వ తేదీన ‘జగన్మోసావతారం’ పేరుతో లోకేశ్ వ్యాసం ప్రచురితమైంది. సీఎం జగన్ తాడేపల్లిలో ఫిడేలు వాయించుకుంటూ కరోనాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోవడం లేదని వ్యాసంలో లోకేశ్ పేర్కొన్నారు. ప్రజలు సరైన సమయంలో వైద్యం అందక విలవిల్లాడుతున్నారని… రాష్ట్రంలో ఆంబులెన్స్ లు కూడా లేని దయనీయ పరిస్థితి నెలకొందని లోకేశ్ పేర్కొన్నారు.
తాజాగా ‘దళిత పక్షపాతి- ఎవరు, ద్రోహి ఎవరు?’ అనే శీర్షికతో వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి దళితులపై దాడులు జరిగాయని లోకేశ్ వ్యాసంలో పేర్కొన్నారు. అయితే ఆ వ్యాసాలు చదివితే నారా లోకేశ్ వేరే వాళ్లతో వాటిని రాయిస్తున్నాడనే విషయం సులువుగానే అర్థమవుతుంది. లోకేశ్ ఈ విధంగా ఇతరులతో వ్యాసాలు రాయిస్తూ వాటిని తనవిగా చెప్పుకుంటే మరిన్ని విమర్శలు తప్పవని ఇలాంటి వేషాలకు లోకేశ్ దూరంగా ఉంటే మంచిదని నెటిజన్లు సూచిస్తుండటం గమనార్హం.
Also Read : ఏపీ జనాలకు జగన్ కన్నా మోదీ పైనే నమ్మకం ఎక్కువా..?